విశాఖ ఎంపీగా గెలిచేదెవరు - ఆ సమీకరణాలే కీలకం..!!
విశాఖ ఇప్పుడు ఎన్నికల సమయంలో కీలకంగా మారుతోంది. పొత్తులో భాగంగా టీడీపీ నుంచి మరోసారి భరత్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ ఎంపీ బొత్సా పోటీ చేస్తున్నారు. మూడు పార్టీల ఓట్ల బదిలీ టీడీపీ అభ్యర్దికి కీలకం కానున్నాయి. స్థానిక సామాజిక సమీకరణాలు తమకు కలిసి వస్తాయని వైసీపీ అభ్యర్ది ధీమాగా చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ప్రచారంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతల్లో ప్రజలకు హమీలు...భవిష్యత్ పై భరోసాలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
పెరుగుతున్న నమ్మకం
విశాఖ ఎంపీ బరిలో ఉన్న ఝాన్సీ తన గెలుపు పైన విశ్వాసంతో ఉన్నారు. గెలుపు కోసం ఎనిమిది సూత్రాలను నమ్ముకున్నారు. టీడీపీ అభ్యర్ది భరత్ సైతం ప్రచారం కొనసాగిస్తున్నారు. ఝాన్సీ స్థానిక అంశాల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వాటి పరిష్కారినికి ఉన్న మార్గాలు..తాను ఏం చేయబోతున్నదీ వివరించి చెబుతున్నారు. భరత్ ప్రచారంలో రాజకీయ ప్రసంగాలే ఎక్కువగా ఉంటున్నాయి.

ఝాన్సీ ప్రచారం, ప్రసంగాలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. విజయనగరం, బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు చేసిన మంచి పనులు ఆమెకు ఇప్పుడు ప్లస్ గా మారాయి. ఎన్నో అభివృద్ధి పనులు ఆమె హయాంలోనే జరిగాయి. రైల్వే గేట్ల దగ్గర నుంచి విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పెన్షన్ సమస్యలు, విశాఖ పోర్టు సమస్యలు పరిష్కారమయ్యాయి.
మారుతున్న సమీకరణాలు
ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగానే బొత్సా ఝాన్సీని విశాఖ నుంచి బరిలోకి దించారు. ఉత్తరాంధ్ర ఆడపడుచుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. స్థానికులు ఓన్ చేసుకుంటున్నారు. ఈ సెంటిమెంట్ ఎన్నికల సమయంలో అనుకూలంగా మారుతోందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఝాన్సీ ఎంపీగా పని చేసిన సమయంలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఆమె గుర్తింపు పొందారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా తొలుత ఆమె ప్రస్తావించారు. విద్యావేత్తగా ఝాన్సీ అచీవ్ మెంట్స్ కూడా ప్రస్తుతం ప్రచార సమయంలో చర్చకు వస్తున్నాయి. ఎంపీగా గతంలో ఉత్తరాంధ్ర సమస్యలపై గొంతెత్తారు. విశాఖ సమస్యలపై పోరాడి, ఎన్నింటినో పరిష్కరించారు. ఆనాడే విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ పోర్టులను ప్రస్తావించారు.
గెలుపు పై ధీమా
విశాఖ పార్లమెంటు పరిధిలో 2.3 లక్షలున్న కాపులు వన్ సైడెడ్ గా బొత్సా ఝాన్సీకి మద్దతుగా నిలుస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజికవర్గాల వారీగా జగనన్ ఇచ్చిన సీట్లు కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో జగన్ అమలు చేసిన సామాజిక ఈక్వేషన్లు పనిచేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఓట్ బ్యాంక్ అదనపు బలంగా మారింది.
రాష్ట్రంలోని 87 శాతం మంది ఈ పథకాల లబ్దిదారులుగా ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థి శ్రీ భరత్ వెనుకంజలో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజకీయ అనుభవం లేకపోవటం.. గీతం పైన ఆరోపణలు మైనస్ గా మారుతున్నాయి. ఝాన్సీ ప్రతీ అడగ వ్యూహాత్మకంగా వేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న స్పందన..స్థానిక సమీకరణాలత గెలుపు పైన ఝాన్సీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications