కొన్ని విషయాలు దాస్తున్నాడు, డబ్బులు జమ అయ్యాయి: జగన్ కేసు నిందితుడి ఆరోగ్యంపై సీపీ
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస రావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని విశాఖపట్నం సీపీ లడ్డా మంగళవారం చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు.
శ్రీనివాస రావు బ్యాంక్ అకౌంట్ల వివరాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. శ్రీనివాసరావు పేరు మీద మూడు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్, ఆంధ్రా బ్యాంకులలో అతనికి అకౌంట్లు ఉన్నాయని చెప్పారు.

వేరేవారి ఫోన్ ఉపయోగించాడు, ఒడిశాకు ఓ దర్యాఫ్తు బృందం
తనతో పని చేసే వ్యక్తి సెల్‌ఫోన్‌ను శ్రీనివాస రావు వినియోగించాడని సీపీ లడ్డా తెలిపారు. కేసును వేర్వేరు కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 35 మంది సాక్షులను ప్రశ్నించామని అన్నారు. ఈ కేసు విషయమై ఒడిశాకు కూడా ఒక దర్యాఫ్తు బృందాన్ని పంపించామని ఆయన చెప్పారు.
Recommended Video


రెగ్యులర్ చెకప్, శ్రీనివాసరావు పూర్తిగా సహకరించడం లేదు
జగన్ పైన హత్యాయత్నం కేసులో ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే సహకరించారని సీపీ లడ్డా తెలిపారు. శ్రీనివాస రావును రెగ్యులర్ మెడికల్ చెకప్‌కు మాత్రమే అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లామని చెప్పారు. శ్రీనివాస రావు విచారణకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని ఆయన చెప్పారు. శ్రీనివాస రావు కొన్ని విషయాలను దాచిపెడుతున్నాడని చెప్పారు.

ఆ సమయంలో క్రికెటర్ల భద్రతా ఏర్పాట్లలో సీఐఎస్ఎఫ్
ఎయిర్ పోర్ట్ కిచెన్‌లో ఉండే వాళ్లు బయటకు ఎలా వచ్చారన్నది కూడా పరిశీలిస్తున్నామని సీపీ లడ్డా తెలిపారు. శ్రీనివాస్ ఉపయోగించిన కత్తితో పాటు సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. దాడి జరిగినప్పుడు క్రికెటర్ల భద్రతా ఏర్పాట్లలో సీఐఎస్ఎఫ్ అధికారులు బిజీగా ఉన్నారని చెప్పారు.

చంపి రాజకీయం చేస్తామని చెప్పడంలో అర్థం లేదు
చంపి రాజకీయం చేస్తామని శ్రీనివాస్ అనడంలో అర్థం లేదని సీపీ లడ్డా అన్నారు. మేం మా డ్యూటీ మేం నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రీనివాస్ అకౌంట్లలోకి డబ్బులు వచ్చాయని చెప్పారు. డబ్బులు ఎందుకు వేశారో, ఎవరికి బదలీ చేశారో విచారణలో తేలుతుందని చెప్పారు. శ్రీనివాస్ కొన్ని విషయాలు దాచి పెడుతున్నాడని అన్నారు.

అతని ఖాతాలో రూ.40వేలు ఓసారి, రూ.20వేలు మరోసారి
అతని ఖాతాలోకి ఓసారి రూ.40వేలు, మరోసారి రూ.20వేలు జమ అయ్యాయని చెప్పారు. డబ్బులు జమైన కాసేపటికే మరొకరి ఖాతాకు బదలీ అయ్యాయని చెప్పారు. కాగా, అంతకుముందు, నాకు ప్రాణహానీ ఉందని శ్రీనివాస రావు చెప్పిన విషయం తెలిసిందే. తనను చంపి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని అతను వ్యాఖ్యానించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసమే ఈ పని చేశానని అతను చెప్పాడు. తాను చనిపోతే తన అవయవాలు దానం చేయాలని అతను చెప్పాడు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications