విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలంలో కొత్త రికార్డ్- ఆదాయం ఎవరికి..!!
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు భూములు ఈ-వేలంలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది. 35 ఏళ్ల క్రితం క్వార్టర్ల కోసం కేటాయించిన ఈ ప్రాంగణం ప్రధాన రహదారి, జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో కొనుగోలుదారులు వేలం పాటలో హోరాహోరీగా పోటీపడ్డారు.వేలంలో మొత్తం 150 ప్లాట్లు విక్రయించగా, రూ. 366.33 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నగర నడిబొడ్డున ఉన్న హెచ్‌బీ కాలనీలోని భూములకు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC) ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి విడత ఈ-వేలానికి ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. ఈ ప్లాట్లకు నిర్ణయించిన రిజర్వ్ ధర రూ.312.48 కోట్లతో పోల్చితే బిడ్ల ద్వారా 17.23 శాతం అధిక ధర లభించింది. కర్మాగారానికి నగరంలోని సీతమ్మధార సమీపాన ఉన్న హెచ్‌బీ కాలనీలో 456 ప్లాట్లు (సుమారు 18.17 ఎకరాలు), గాజువాక ఆటోనగర్‌లోని బ్లాక్ 2, 3లలో మూడు ప్లాట్లు (0.56 ఎకరాలు) చొప్పున మొత్తం 19.29 ఎకరాలు ఉంది. హెచ్‌బీ కాలనీలో గతంలో స్టీల్‌ప్లాంట్ సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించారు. అవి శిథిలం అయిపోవడంతో వాటిని కూలగొట్టి భూమిని ప్లాట్లుగా విభజించారు.

అంచనాలకు మించి స్పందన
కాగా, ఆ ప్లాట్లను విక్రయించాలని కొద్దికాలం కిందట నిర్ణయించుకుని, ఆ బాధ్యత నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ)కి అప్పగించారు. వేలం ద్వారా రూ. 900 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలివిడత ఈ-వేలం వేసిన ప్లాట్లు 128.94 గజాలతో మొదలుకొని అత్యధికంగా 2,728 చ.గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. అత్యధికంగా చదరపు గజం రూ. 1.8 లక్షలు పలికింది. హెచ్‌బీ కాలనీ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16కి)కి దగ్గరగా ఉంది. నీటి సమస్య లేదు. దాంతో మంచి రేటు పలికింది. మలి విడత వేలం పాటలు ఈ నెల 16, 30 తేదీల్లో నిర్వహించనున్నారు గతంతో పోలిస్తే ఈసారి పొందిన ఆదాయం 17 శాతం అధికంగా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
