రష్మికే ఇండియా నంబర్ 1 హీరోయిన్? మిగతా హీరోయిన్లు ఏం కావాలి గురూ!

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ రణబాలి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్నపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమెను ఓ బంగారు గని అంటూ అభివర్ణించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్.. రష్మిక ఏ స్థాయికైనా చేరుకోగలదని కొనియాడారు. అంతే కాకుండా "నువ్వు ఇండియాలోనే అగ్ర నటివని నీకు తెలుసా?" అని ఆయన ఆమెను ప్రశ్నించడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Ranabaali Censor Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' సెన్సార్ రివ్యూ..
Ranabaali Censor Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' సెన్సార్ రివ్యూ..

రష్మికను ఓ గోల్డ్ మైన్ అని పిలవడం సహేతుకమే. ఆమె తన నటనతో ఎన్నో సవాళ్లతో కూడిన పాత్రలను సమర్థవంతంగా పోషించిన అద్భుతమైన నటిగా నిలిచింది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. 'యానిమల్', 'పుష్ప 2: ది రూల్', 'ఛావా' వంటి సినిమాలు ఆమెను హిందీ మార్కెట్‌తో సహా పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు దగ్గర చేశాయి.

Rashmika Mandanna Is India No 1 Actress Director Rahul Sankrityan Bold Praise Sparks Debate Details
సోషల్ మీడియాను ఊపేస్తున్న 'జిమ్ జిమ్ తార’.. పూర్తి పాట వచ్చేసింది!
సోషల్ మీడియాను ఊపేస్తున్న 'జిమ్ జిమ్ తార’.. పూర్తి పాట వచ్చేసింది!

అయితే ఆమెను ఇండియాలోనే అత్యుత్తమ నటి అని అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పలువురు హీరోయిన్లు కూడా వరుస విజయాలు సాధిస్తూ తమ నటనతో ప్రశంసలు అందుకుంటున్నారు. అందువల్ల ఈ నంబర్ వన్ స్థానంపై చర్చ జరగడం సహజం. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కు రష్మిక నటనపై పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ.. ఆమె నిజంగానే ఇండియాలోనే అగ్ర నటి పిలుచుకోవడానికి అర్హురాలా కాదా అనే విషయాన్ని నిర్ణయించాల్సింది మాత్రే ప్రేక్షకులే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+