సీట్ల పై పట్టు వీడని పవన్, అక్కడే పీఠముడి - సీఎం చంద్రబాబు తాజా చర్చల్లో...!!
స్థానిక ఎన్నికల పై కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. అటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేయాల్సి ఉండగా.. మధ్యాహ్నానికి వాయిదా పడింది. అర్ద్రరాత్రి వరకు సీట్ల సర్దుబాటు పైన చర్చలు జరిగినా తేలలేదు. జనసేనాని పవన్ తమ ప్రతిపాదల విషయంలో పట్టు వీడటం లేదు. ఆ ప్రతిపాదనల పైన టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మరోసారి సీఎం చంద్రబాబుతో జనసేన, బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పొత్తుల లెక్కల పైన స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు.
కూటమిలో మున్సిపల్ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా తేల లేదు. మంగళవారం అర్ద్రరాత్రి వరకు సీఎం చంద్రబాబు సమక్షంలో కూటమి పార్టీల నేతల చర్చలు జరిగాయి. అయినా, ఫలితం రాలేదు. ప్రధానంగా జనసేన ఆరు కార్పొరేషన్లు, 40 మున్సిపాలిటీలు పొత్తులో భాగంగా ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మూడు కార్పొరేషన్లు, 15 వరకు పురపాలక సంఘాలు ఇచ్చేందుకు టీడీపీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీకి ఒక కార్పొరేషన్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనసేన కోరుతున్న సీట్లలో కొన్నింటిని టీడీపీ వదులుకోవటానికి సిద్దంగా లేదని సమాచారం. జనసేన నుంచి బలమైన అభ్యర్ధులు ఉన్నారని.. గెలవటం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో సీట్లు తేలకుంటే ఫ్రెండ్లీ కంటెస్ట్ అంశం పైనా పార్టీలో చర్చ జరుగుతోంది.

ఈ సమావేశంలో స్పష్టత వచ్చేనా
మరో వైపు జనసేన ముఖ్య నేతలు తమకు 40 శాతం సీట్ల షేరింగ్ పైన సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టింగ్స్ సంచలనంగా మారుతున్నాయి. చర్చల వేళ ఈ పోస్టింగ్స్ కూటమిలో చర్చ గా మారాయి. టీడీపీ 15-20 మున్సిపాల్టీలు.. మూడు కార్పోరేషన్ల ప్రతిపాదన పైన జనసేన నేతలు పవన్ తో చర్చించారు. పవన్ అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో. . ఇప్పుడు మరోసారి సీఎం చంద్రబాబు వద్ద చర్చలు మొదలయ్యాయి. ఏపీ టీడీపీ చీఫ్ పల్లా, మంత్రి నిమ్మల రామా నాయుడు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, శివ శంకర్ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై నేడు తుది చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు చర్చలలో ఇద్దరు చెరో మెట్టు దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. జనసేన తమకు కావాలని పట్టుబడుతున్న విజయవాడలో అప్పుడే అభ్యర్థిపై నిర్ణయానికి వచ్చింది. వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకుని మేయర్ సీటు ఇవ్వనున్నారు. దీంతో.. ప్రస్తుతం చర్చల్లో మూడు పార్టీల మధ్య సర్దుబాటు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ భేటీలోనూ స్పష్టత రాకుంటే పవన్ నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.













Click it and Unblock the Notifications
