IND vs WI: హైదరాబాద్లో టీమిండియా మరో చరిత్ర సృష్టిస్తుందా?
IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్లో తదుపరి పోరుకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సిద్ధమైంది. ఇండోర్ మ్యాచ్లో ఆశించిన స్థాయిలో పరుగులు రాకపోయినా, బ్యాటింగ్కు స్వర్గధామంగా పేరుగాంచిన ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే స్టేడియంలో టీమిండియా గతంలో 297 పరుగులు చేసి 300 మార్కును కొద్దిలో చేజార్చుకుంది. ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్లో ఆ మార్కును అందుకోవడమే కాకుండా సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.
హైదరాబాద్తో ముడిపడిన చారిత్రక రికార్డులు
2024 అక్టోబర్ 12న హైదరాబాద్లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్ చెలరేగిపోయారు. సంజు శాంసన్ 47 బంతుల్లోనే 111 పరుగులు చేయడంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు సాధించింది. ఇది భారత టీ20 చరిత్రలోనే అత్యధిక స్కోరు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై 283/1, న్యూజిలాండ్ జట్టుపై 271/5 పరుగులు సాధించినప్పటికీ.. ఉప్పల్లో నమోదైన 297 పరుగుల రికార్డే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో వెస్టిండీస్ జట్టుపై కూడా అదే స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి.

రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్, వాతావరణం
ఉప్పల్ స్టేడియం ఐపీఎల్లో 286, 277 వంటి భారీ స్కోర్లకు వేదికగా నిలిచింది. అయితే ఇటీవల ఈ పిచ్ను తిరిగి సిద్ధం చేయడంతో బౌన్స్, బంతి వేగాన్ని బట్టి మ్యాచ్ గమనం మారవచ్చు. మ్యాచ్ సమయంలో వర్షం సూచనలు లేకపోవడం అభిమానులకు ఉపశమనం కలిగించే అంశం. అయితే రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున బంతిపై పట్టు సాధించడం బౌలర్లకు కష్టతరంగా మారవచ్చు. దీంతో టాస్ గెలిచిన జట్టు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
హోం గ్రౌండ్లో అభిషేక్ ధనాధన్ అటాక్
సన్రైజర్స్ హైదరాబాద్ హోంగ్రౌండ్ కావడంతో ఆ జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఈ స్టేడియంపై పూర్తి అవగాహన ఉంది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్లతో కలిసి ఐపీఎల్లో వీరవిహారం చేసిన అభిషేక్ శర్మ భారత జట్టు తరఫున మంచి స్టార్ట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే కేవలం ఒకరిపైనే కాకుండా బ్యాటింగ్ యూనిట్ మొత్తం బాధ్యత తీసుకుంటేనే 300 పరుగులమార్కు సాధ్యమవుతుంది.
కరీబియన్లకు డూ ఆర్ డై
సిరీస్ లో 1-2తో వెనుకబడిన వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే విండీస్ తప్పక గెలవాల్సిందే. భారీ షాట్లు ఆడటంలో దిట్టలైన కరీబియన్ బ్యాటర్లు పుంజుకుంటే భారత బౌలర్లకు గట్టి సవాలు ఎదురుకానుంది. మొత్తానికి ఉప్పల్ స్టేడియంలో భారత్ 300 పరుగుల క్లబ్లో చేరుతుందా లేక వెస్టిండీస్ దెబ్బకొడుతుందా అనే మ్యాచ్లో ఆసక్తికరంగా మారనుంది.













Click it and Unblock the Notifications
