DRDO: క్వాంటమ్ కంప్యూటర్లకు సైతం చిక్కని సీక్రెట్ సెక్యూరిటీ!

దేశ రక్షణ రంగంలో సరికొత్త శకం ప్రారంభమైంది. సైబర్ బెదిరింపులు, శత్రుదేశాల హ్యాకింగ్ కుట్రలకు చెక్ పెడుతూ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. అడ్వాన్స్‌డ్ సైబర్ సెక్యూరిటీ సాంకేతికత అయిన 'క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్' (QKD) ప్లాట్‌ఫామ్‌ను ప్రత్యక్ష నెట్‌వర్క్‌లో విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీవో బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఉన్న ప్రూఫ్ & ఎక్స్‌పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (PXE) వద్ద ఈ కీలక ప్రయోగాన్ని నిర్వహించారు. దీనితో దేశభద్రతకు సంబంధించిన డిజిటల్ కమ్యూనికేషన్లకు ఛేదించలేని రక్షణ వలయం ఏర్పడింది.

హ్యాకింగ్‌కు తావులేని వ్యవస్థ!

ఈ ప్రయోగం ద్వారా ఆర్టిలరీ, ఆర్మోర్డ్ ఆయుధాల పరీక్షలకు సంబంధించిన రియల్-టైమ్ సమాచారం, టెలిమెట్రీ పరిశీలనలకు పూర్తిస్థాయి భద్రత లభిస్తుందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ఎంసీసీ క్లస్టర్, టాక్‌బిట్ ల్యాబ్స్ కలసి ఈ వినూత్న వ్యవస్థను రూపొందించాయి. క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా పనిచేసే ఈ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వ్యవస్థలో డేటా ప్రసారమయ్యే సమయంలో ఎవరైనా శత్రువులు రహస్యంగా నిఘా వేయడానికి లేదా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తించే వీలుంటుంది. మామూలు డిజిటల్ నెట్‌వర్క్‌లలో ఇది అసాధ్యం.

DRDO Tests Quantum Key Distribution Platform Successfully In Live Test Ranges At PXE Chandipur In Odisha
ఆర్మీ వాహనాలు ఇక శతృ దుర్భేధ్యం..: డీఆర్డీఓ బిగ్ బ్రేక్ త్రూ
ఆర్మీ వాహనాలు ఇక శతృ దుర్భేధ్యం..: డీఆర్డీఓ బిగ్ బ్రేక్ త్రూ

భవిష్యత్తు క్వాంటమ్ కంప్యూటర్లకు కూడా చిక్కని కోడింగ్!

సాధారణంగా గణిత సూత్రాల ఆధారంగా పనిచేసే అల్గారిథమ్‌ల భద్రతను భవిష్యత్తులో వచ్చే శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లు ఛేదించే ప్రమాదం ఉంది. అయితే క్వాంటమ్ కమ్యూనికేషన్ అందించే ఎన్‌క్రిప్షన్‌ను ఛేదించడం ఏ సాంకేతికతకైనా అసాధ్యం. దీనివల్ల ఆర్మీ, డిఫెన్స్ రంగాలు మాత్రమే కాకుండా ఆర్థిక రంగం, టెలికాం, ఇతర కీలక ప్రాజెక్టుల సమాచారాన్ని భద్రపరచడం అత్యంత సులభమవుతుంది. ముఖ్యంగా ఉచితంగా లభించే ఫ్రీ-స్పేస్ QKD ద్వారా కొండ ప్రాంతాలు, రద్దీగా ఉండే నగరాల్లో ఖరీదైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయాల్సిన అవసరం లేకుండానే సురక్షిత సంభాషణలు జరపవచ్చు.

Agni Missile: ఏకఛత్రాధిపత్యానికి చెక్.. క్షిపణుల తయారీలో ప్రైవేట్ జోరు!
Agni Missile: ఏకఛత్రాధిపత్యానికి చెక్.. క్షిపణుల తయారీలో ప్రైవేట్ జోరు!

ఐఐటీలు, ప్రముఖ వర్సిటీలతో కలిసి సరికొత్త ప్రయోగాలు!

ఇలాంటి అత్యంత అధునాతన రక్షణ పరిజ్ఞానాన్ని మన దేశంలోనే సొంతంగా అభివృద్ధి చేసేందుకు డీఆర్‌డీవో ప్రత్యేక చొరవ చూపుతోంది. 'డీఆర్‌డీవో-ఇండస్ట్రీ-అకాడమియా - సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' (DIA-CoEs) కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎస్సీ సహా ప్రముఖ విద్యాసంస్థల్లో 15 ప్రత్యేక పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారతీయ శాస్త్రవేత్తలు, యువ సైంటిస్టులు, పారిశ్రామిక రంగాలు కలసి పనిచేస్తూ భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+