హెచ్చరిక: ఏపీలో అతి ముఖ్యమైన రైలు రద్దు

ఏపీలోని రైల్వే ప్రయాణికులకు అతి ముఖ్యమైన గమనిక.. అలాగే తిరుమల వెళ్లేవారికి బ్యాడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. విశాఖపట్నం నుంచి కడప(17488) మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్ ప్రెస్ ను అధికారులు ఆగస్టు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు. కడప నుంచి విశాఖపట్నం(17487) మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్ ప్రెస్ ను కూడా ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రద్దుచేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ లో మూడోలైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరగాల్సి ఉండటంతో తిరుమలను రద్దుచేశారు.

తిరుమల ఎక్స్ ప్రెస్ తోపాటు మరికొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు.
విజయవాడ- గూడూరు (07500) ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు
గూడూరు- విజయవాడ (07458) ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు
విజయవాడ- ఒంగోలు (07461) ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు
ఒంగోలు- విజయవాడ (07462) ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు
విజయవాడ- గూడూరు-విజయవాడ (12743/12744) ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు
గూడూరు- విజయవాడ-గూడూరు (17259/17260) ఈనెల 16, 23, 24, 30 తేదీల్లో రద్దు.

visakhapatnam to kadapa tirumala express train cancelled fro august 5th to august 10th 2024

ఎర్నాకుళం- హౌరా (22878) ఈ నెల 15, 22, 29 తేదీల్లో
సంత్రాగచి- తాంబరం (22841) ఈ నెల 22,29 తేదీల్లో
హౌరా- బెంగళూరు (22863) 22వ తేదీ
మధురై- నిజాముద్ధీన్‌ (12651) ఈ నెల 23,30 తేదీల్లో రద్దు

సమయం మార్చిన రైళ్ల వివరాలు
చెన్నైసెంట్రల్‌- గయ (12390)16, 30 తేదీల్లో 90 నిముషాలు
తిరునల్వేలి- కత్రా (16787) 15, 29 తేదీల్లో 90 నిముషాలు
ఆదిలాబాద్‌- తిరుపతి (17406) 15వ తేదీన 60నిమిషాలు
బెంగళూరు- హతియా (18638) ఈ నెల 16న 210 నిమిషాలు
నిజాముద్దీన్‌- చెన్నైసెంట్రల్‌ (12612) ఈ నెల 16న 100నిమిషాలు
హౌరా- కన్యాకుమారి (12665) 15న 180నిమిషాలు, 22న 120 నిముషాలు, 29న 90 నిముషాల ఆలస్యంగా నడుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+