ఇన్ఫోసిస్ సహా అందరి మద్దతు: సిడ్నీ కేఫ్ ఘటనపై తెలుగు టెక్కీ
హైదరాబాద్: కష్టకాలంలో తనకు అన్ని వర్గాల నుండి చక్కటి మద్దతు లభించిందని ఆస్ట్రేలియా తీవ్రవాది చేతుల్లోంచి క్షేమంగా బయటపడ్డ తెలుగు సాఫ్టువేర్ ఇంజినీర్ విశ్వకాంత్ చెప్పారు. ముఖ్యంగా తన కంపెనీ ఇన్ఫోసిస్ యాజమాన్యం మద్దతుగా నిలిచిందన్నారు.
స్నేహితులు, సన్నిహితులు, ఆస్ట్రేలియా ప్రజలు, భారత ప్రభుత్వం నుండి చక్కటి మద్దతు వచ్చిందని చెప్పారు. జరిగిన సంఘటన నుండి తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. తాను క్షేమంగా బయటపడాలని అందరు కోరుకున్నారని, అందుకే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

ఆయన భారత ప్రధాని కార్యాలయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే, ప్రస్తుతానికి తనకు, తన కుటుంబానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
కాగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల కేఫ్‌లో ఉగ్రవాది పలువురిని బందించిన విషయం సంచలనం రేపిన విషయం తెలిసిందే. బందీలను విడిపించేందుకు కమెండోలు చేపట్టిన ఆపరేషన్ దాదాపు పదహారు గంటల తర్వాత ముగిసింది. ఈ బందీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా టెక్కీ విశ్వకాంత్ అంకిరెడ్డి సహా బందీలను కమెండోలు విడిపించారు.
అంతకుముందే కొందరు పారిపోయారు. దాదాపు 16 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. సిడ్నీ కేఫ్ ఆపరేషన్‌లో బాంబు డిస్పోజల్ రోబోట్‌ను ఉపయోగించారు. బందీలు ఉగ్రవాది నుంచి పారిపోతున్న దృశ్యాలను ఆస్ట్రేలియా టీవీలు ప్రసారం చేశాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications