రజనీకాంత్ సినిమా షూటింగ్ అతి సమీపంలో ప్రమాదం
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ త్రిల్లర్ చిత్రం 'కూలీ'. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం బీచ్ రోడ్డులో జరుగుతోంది. శనివారం కంటైనర్ టెర్మినల్ వద్ద షూటింగ్ ప్రాంతానికి అతి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మూవీ యూనిట్ అప్రమత్తమైంది.
లిథియం బ్యాటరీల లోడ్‌తో వచ్చిన కంటైనర్ షిప్ వద్ద మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. కంటైనర్ టెర్మినల్ అగ్నిప్రమాదంపై యాజమాన్యం స్పందించింది. లిథియం బ్యాటరీ కంటైనర్ లోడ్ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. చైనా నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన కంటైనర్ లోడ్ ఆగస్టు 28న విశాఖ చేరుకుంది.

శనివారం అన్‌లోడ్ చేస్తున్న సమయంలో కంటైనర్‌లోని ఒక బాక్స్‌లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టడంతో ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పోర్టు అధికారుల నుంచి వివరాుల సేకరించిందని కంటైనర్ టెర్మినల్ యాజమాన్యం పేర్కొంది.
కాగా, రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 40 రోజులపాటు విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో కూలీ షూటింగ్‌ను మేకర్లు ప్లాన్ చేశారు. తాజాగా షూటింగ్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో షూటింగ్ స్పాట్ మార్చాలా? అనేదానిపై చర్చిస్తున్న సమాచారం. కాగా, ఇటీవల కాలంలో విశాఖలోని పలు పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications