మజ్జి సిరికి మద్దతుగా మరో సీనియర్, బొత్సాను వీడి - స్థానిక పోరులో మారుతున్న లెక్కలు..!!
స్థానిక ఎన్నికల వేళ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ మధ్య రాజకీయం హోరా హోరీగా మారుతోంది. పలు చోట్ల కూటమి అభ్యర్ధులకు రెబల్స్ బెడద తప్పటం లేదు. ఇదే సమయంలో ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి నేతలు పదే పదే నిర్దేశం చేస్తున్నారు. కాగా.. విజయనగరం జిల్లాలో మజ్జి వర్సస్ బొత్సా రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. జెడ్పీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది.
విజయనగరం కేంద్రంగా రాజకీయం ఆసక్తిగా మారుతోంది. మజ్జి శ్రీను తన కుమార్తెతో కలిసి టీడీపీ లో చేరిన సమయం నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సైతం మజ్జి శ్రీనుతో కలిసి టీడీపీలో చేరారు. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా మజ్జి సిరికి ఇస్తామని టీడీపీ నాయకత్వం నుంచి హామీ దక్కింది. ఇప్పటికే జెడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేసారు. అటు వైసీపీ నుంచి బొత్సా కుమార్తె అనూష సైతం జెడ్సీ బరిలో నిలిచారు. ఈ ఇద్దరి మధ్య జెడ్పీ సీటు కోసం హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ఈ ఎన్నిక బొత్సా రాజకీయం.. సమర్థతకు పరీక్షగా మారుతోంది. కాగా.. తాజాగా బొత్స కుటుంబానికి సన్నిహితుడు, మజ్జి శ్రీనివాస రావు బడ్డుకొండ అప్పలనాయుడు సైతం ఇప్పుడు టీడీపీలో చేరారు.

జెడ్పీ ఎన్నికల్లో మారుతున్న లెక్కలు
నెల్లిమర్ల ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పని చేసిన అప్పలనాయుడును మజ్జి శ్రీను పార్టీ వీడగానే ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు . ఆ తరువాత పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దీంతో.. ఆ సమయంలోనే వైసీపీ పైన అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీలో చేరుతారనే సమాచారంతోనే వైసీపీ అధినేత అప్పలనాయుడు పైన చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక.. మరో వారంలో జెడ్పీ ఎన్నికల వేళ ఇప్పుడు అప్పలనాయుడు టీడీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లో బొత్సాతో కలిసి ఒకప్పుడు చక్రం తిప్పిన చిన్నశ్రీను, బడ్డుకొండ అప్పలనాయుడు ఇద్దరూ టీడీపీలో చేరటంతో ఇప్పుడు జిల్లా పరిషత్ పోరు ఆసక్తిగా మారుతోంది. దీంతో... ఇప్పుడు బొత్సా రాజకీయం ఎలా ఉంటుంది.. జిల్లా పరిషత్ ఎవరికి దక్కుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పెంచుతోంది.













Click it and Unblock the Notifications
