Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈవీఎంల గురించి బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబే: ఉండవల్లి అరుణ్ కుమార్

Vundavalli Arun Kumar: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిపై లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏపీలో 12.5 శాతం మేర ఓట్లు అధికంగా పోల్ అయ్యాయంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన సమాచారంపై స్పందించారు. 12.5 శాతం ఓట్లు అధికంగా పోల్ కావడం అంటే మాటలు కాదని, దీనిపై ఎందుకు విచారణ జరిపించకూడదని ప్రశ్నించారు.

Vundavalli Arun Kumar made key remarks on Polling in Andhra Pradesh

అది అబద్ధం, అవాస్తవం అని తేలితే ఏపీలో ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ కార్యకలాపాలను నిషేధించవచ్చని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడేనని, ఆయన ప్రభుత్వంపై ఈ సంస్థ చేసిన ఆరోపణలపై ఎందుకు స్పందించకపోవడం పట్ల ఉండవల్లి అరుణ్ కుమార్ అనేక అనుమానాలను వ్యక్తం చేశారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో చంద్రబాబు ఎక్స్‌పర్ట్ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. దేశంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి అయనేనని గుర్తు చేశారు. ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఇప్పుడు వస్తోన్న అనుమానాలను క్లియర్ చేయాల్సింది కూడా ఆయనేనని చెప్పారు.

లేదంటే- ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన నివేదిక బోగస్ అని ప్రకటించాలని, దాన్ని నిషేధించాలని అన్నారు. ఓట్ ఫర్ డెమోక్రసీలో ఉన్న వాళ్లందరూ వివిధ రంగాల్లో అత్యంత నిష్ణాతులని, వాళ్లెందుకు ఇలా బోగస్ సమాచారాన్ని ఇస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 81 ప్రకారం..స్లిప్పులను 45 రోజుల పాటు భద్రపర్చాల్సి ఉందని, పోలింగ్ ముగిసిన 20 రోజుల్లోనే వాటిని డెస్ట్రాయ్ చేయాలంటూ అప్పటి ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలను సైతం జారీ చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు లెక్కించడానికి స్లిప్పులను భద్రపర్చాల్సి ఉంటుందని, దీనికి భిన్నంగా 20 రోజుల్లోనే వాటిని నామరూపాల్లేకుండా చేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ఒక ఈవీఎంను సంపాదించారనే కారణంతో హరి ప్రసాద్‌ను జైలులో కూడా పెట్టారని, వాటిపై ఆయన ఎంతో అధ్యయనం చేశారని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+