రామోజీరావు సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఏకైక వ్యక్తి అతనే

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. రామోజీ గ్రూప్‌లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌, ఉషాకిరణ్‌ మూవీస్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, కళాంజలి, బ్రిసా షోరూమ్స్‌ వంటి సంస్థలున్నాయి. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు రామోజీరావు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు.

పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించారు.తెలుగు జర్నలిజం, వినోదం రంగంలో ఆయన చేసిన సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రామోజీరావుపై తొలిసారి కోర్టుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కచ్చింతంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమారే అని చెప్పాలి.

vundavalli Arun Kumar was the only one who troubled Ramoji Rao

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌‌లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది. గత వైస్.జగన్ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ పోలీసులు ఈ కేసులో రామోజీరావును విచారించడానికి కూడా రెడీ అయ్యారు. ఆ సమయంలో ఆయన తనకు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పిన వీడియో కూడా వైరల్ అయింది. ఏది ఏమైనప్పటికి వైఎస్ఆర్, కేసీఆర్, జగన్ వంటి నాయకులు సైతం రామోజీరావును టచ్ చేయలేకపోయారు. అలాంటిది ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం కేసులతో ఆయన్ను కొంతమేర ఇబ్బంది పెట్టారనేది మాత్రం వాస్తవం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+