చంద్రబాబును జైలులో పెట్టేంత వరకూ..: ఆర్జీవీ సంచలనం..!!
Vyooham, Sapatham: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమాలు.. వ్యూహం, శపథం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని చిత్రీకరించిన సినిమా ఇది. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. ఎన్నో న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొని, ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
రెండు భాగాలుగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంది. ఫస్ట్ పార్ట్ ఈ నెల 23వ తేదీన విడుదల కానుంది. శపథం పేరుతో తెరకెక్కిన రెండో భాగం.. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.

వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటించాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌ను మానస రాధాకృష్ణన్ పోషించారు. ఇప్పటికే వైఎస్ జగన్ పాదయాత్రను కథాంశంగా తీసుకుని నిర్మించిన యాత్ర 2 మూవీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు వ్యూహం, శపథం ఎలా ఉండబోతోన్నాయనేది ఆసక్తి రేపుతోంది.
నిజానికి- గత ఏడాది డిసెంబర్‌లో వ్యూహం రిలీజ్ కావాల్సి ఉండగా.. దీన్ని అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కోర్టుకెక్కారు. సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ సెన్సార్ బోర్డుకూ లేఖ రాశారు. ఆ తరువాత తెలంగాణ హైకోర్టులోనూ పిటీషన్లు దాఖలు చేశారు. దీనితో ఈ సినిమా విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. తీరా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకున్న దశలో విడుదల కాబోతోంది.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఈ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూలను ఇస్తోన్నారు. ఏపీలో నెలకొన్న ఎన్నికల వాతావరణం, సమాకాలీన రాజకీయాల పరిస్థితులపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తోన్నారాయన.
తాజాగా ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. అమెరికాలో నివసిస్తోన్న తెలుగువారిని ఉద్దేశించిన వీడియో ఇది. దీన్ని తన అధికారక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వ్యూహం, శపథం.. సినిమాలు తన కేరీర్‌లో ప్రత్యేకంగా మిగిలిపోతాయని అన్నారు. నిన్న, మొన్న మన కళ్ల ముందు జరిగిన రాజకీయ సంఘటనలను ఒక సిినిమా చిత్రీకరించడం తనకు తెలిసి ప్రపంచంలో మొదటిసారిగా అభివర్ణించారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూసినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు వ్యూహం సినిమా ఉంటుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని జైలులో పెట్టేంత వరకు శపథం సిినిమా ఉంటుందని అన్నారు.
ఈ రెండు సినిమాల చిత్రీకరణలో ఒకే ప్యాటర్న్‌ను అనుసరించామని, మనం రోజూ పేపర్లల్లో చదువుకున్న కథనాలకు, ఈ సినిమాలకు ఎలాంటి తేడా ఉండదని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఓ సినిమాను వారం రోజుల వ్యవధిలో విడుదల చేయబోతోండటం కూడా ఇదే తొలిసారి అని అన్నారు. ఈ రెండు సినిమాలు కూడా తనకు ఎంత స్సెషల్ అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications