గర్ల్ నెత్తిపై జగన్ చెయ్యి, బాబుకు ఛాలెంజ్ (పిక్చర్స్)
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. జగన్ సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధంగా వున్నారా? అంటూ చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు జగన్ సవాల్ విసిరారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ 30 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి మళ్లీ తన పాలన తీసుకు వస్తానని చెప్పగలరా అని ప్రశ్నించారు. బాబు రూపాయి ఇస్తానన్న ఎవరూ నమ్మరని, తాను యాభై రూపాయలు ఇస్తానన్న ప్రజలు నమ్ముతారన్నారు. ఎన్టీఆర్ పథకాలను తుంగలో తొక్కడమే కాకుండా స్వయంగా బాబు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదన్నారు.
ఇప్పుడు అదే చంద్రబాబు అన్నీ ఉచితమంటూ సునాయాసంగా హామీలిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతి గొంతు జై సమైక్యాంధ్ర అని నినదిస్తోందన్నారు. అయినా చంద్రబాబుకు, కిరణ్ రెడ్డికి అర్థం కావడం లేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్దాం రావాలన్నారు.

జగన్ 1
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఆయనకు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారని వైయస్ జగన్ అన్నారు.

జగన్ 2
సమైక్య శంఖారావం యాత్ర సందర్భంగా మంగళవారం మదనపల్లెలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ, తన తండ్రి బతికుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నారు.

జగన్ 3
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి విశ్వసనీయత గురించి మాట్లాడం తగదన్నారు.

జగన్ 4
జగన్ సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలితో జగన్ మాట్లాడుతూ....

జగన్ 5
ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి గౌరవానికి జరుగుతున్న అంతర్యుద్ధంలో సమైక్యమే గెలుస్తుందన్నారు. అధికారంలో ఉండగా రైతుల్ని విస్మరించి ఇప్పుడు రైతు సంక్షేమం గురించి మాట్లాడడం ఆయన అవకాశవాదానికి నిదర్శనమని బాబుపై జగన్ నిప్పులు చెరిగారు.

జగన్ 6
ఎన్టీఆర్ చేసిన గొప్పపనులు ఇప్పుడు చెప్పుకోవడంలో అర్థం లేదని, బిసిలకు వందసీట్లిస్తానన్న చంద్రబాబు ఆ మాట ఎక్కడ నిలుపుకున్నారని ప్రశ్నించారు.

జగన్ 7
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

జగన్ 8
రాజకీయాలంటే ఓ వ్యక్తిని జైల్లో పెట్టడం కాదు, బెయిల్ రాకుండా చేయడం కాదు.. ఎన్నికలలో బలాబలాలు తేల్చుకోవడమేనని స్పష్టం చేశారు.

జగన్ 9
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో వైయస్ విగ్రహం వద్ద మాట్లాడుతూ...

జగన్ 10
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో చిన్నారిని ఎత్తుకొని..

జగన్ 11
చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి యాత్రలో జెండాతో అభిమాని.

జగన్ 12
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. జగన్ సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో సాగింది.

జగన్ 13
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications