వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దరికంపై తేల్చేసిన చిరంజీవి: మళ్లీ అటు వైపు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన అప్ కమింగ్ మూవీ వాల్తేర్ వీరయ్య. శృతిహాసన్ హీరోయిన్. సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ కీలక పాత్రను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కింద దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) ఈ మూవీని తెరకెక్కించారు. శృతి హాసన్, కేథరిన్ ట్రెస్సా, నివేదా పేథురాజ్, బాబీ సింహ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

మాస్ లుక్స్ లో..

మాస్ లుక్స్ లో..

ఆచార్య డిజాస్టర్ తరువాత చిరంజీవి నటించిన మాస్ మూవీ కావడం వల్ల దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ అప్పియరెన్స్ ఇచ్చారు చిరంజీవి. ముఠా మేస్త్రీ తరహా గెటప్ లో కనిపించారు. ఈ మూవీ టైటిల్ టీజర్.. మూవీ సత్తా ఏమిటనేది స్పష్టం చేసింది. జనవరి 4వ తేదీన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం కోట్లాది మంది చిరు అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.

ప్రమోషన్స్ లో..

ప్రమోషన్స్ లో..

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు మెగాస్టార్. ఇటీవలే ప్రెస్ మీట్‌ ను నిర్వహించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తోన్న కొద్దీ తన ప్రమోషన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసేలా ప్లాన్ వేసుకున్నారు. ఇవ్వాళ ఆయన హైదరాబాద్ లో చిత్రపురి కాలనీని ప్రారంభించారు.

ఆ ఆశ లేదు..

ఆ ఆశ లేదు..

ఈ కార్యక్రమంలో చిరంజీవి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దరికం బాధ్యతలను తీసుకోవాలంటూ తనను అందరూ కోరుతున్నారని, ఆ ఆశ తనకు లేదని తేల్చి చెప్పారు. ఇండస్ట్రీకి పెద్దన్నగా గుర్తింపు, పేరు తెచ్చుకోవాలనే కోరిక తనకు లేదని స్పష్టం చేశారు. అలాంటి గుర్తింపు తనకు సరిపడదని వివరించారు. పరిశ్రమకు ఎప్పుడు అవసరం వచ్చినా తాను ముందుంటానే తప్ప- ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించేంతటి బాధ్యతలు మాత్రం తనకు అప్పగించొద్దని సున్నితంగా తిరస్కరించారు.

భుజం కాస్తానే తప్ప..

భుజం కాస్తానే తప్ప..

దేవుడు తాను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడని, కుటుంబం అత్యున్నత స్థాయిలో ఉందని, ఓ సాధారణ వ్యక్తికి ఇంతకంటే ఇంకే కావాలని చిరంజీవి ప్రశ్నించారు. పరిశ్రమకు ఎలాంటి కష్టం వచ్చినా, అవసరం వచ్చినా భుజం కాస్తానే తప్ప పెద్దరికం వంటి పెద్ద బాధ్యతలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. మున్మందు తాను సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరింపజేయాలని భావిస్తోన్నానని, అలాంటి సమయంలో ఇండస్ట్రీ పెద్దరికం బాధ్యతలను తీసుకోవడం సమంజసం కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

రాజకీయాల వైపు..

రాజకీయాల వైపు..

తాను ఇప్పుడీ స్థానంలో ఉండటానికి భగవంతుడి ఆశీర్వాదంతో పాటు ప్రజలు, సమాజం కూడా కారణమని చిరంజీవి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాల గురించి చిరంజీవి ఇదివరకే పలు వేదికల మీద తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారాయన. ఆయన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలను కొట్టిపారేశారు.

English summary
Waltair Veerayya: Mega Star Chiranjeevi made key comments in inauguration of Chitrapuri colony
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X