వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

36 గంటలైనా రాని క్లియరెన్స్?: బోనీకపూర్ ఉన్నారా, లేరా? శ్రీదేవి మృతిపై షాకింగ్ కథనాలు!

|
Google Oneindia TeluguNews

ముంబై: నటి శ్రీదేవి మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం పూర్తయింది. కాసేపట్లో ఆమె మృతదేహాన్ని అప్పగించనున్నారని తెలుస్తోంది. పోస్టుమార్టం, మృతదేహం అప్పగింత విషయంలో జాప్యం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

Dubai Media Highlighting Sridevi News

శ్రీదేవి మృతదేహానికి దాదాపు 36 గంటల తర్వాత కూడా దుబాయ్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. పోస్టుమార్టం పూర్తి అయిన నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతి రాగానే డెత్ సర్టిఫికేట్ జారీ చేయనున్నారు. పోలీసులు న్యాయపరమైన క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

పర్యవేక్షిస్తున్న ఇండియన్ కాన్సులేట్ అధికారులు

పర్యవేక్షిస్తున్న ఇండియన్ కాన్సులేట్ అధికారులు

శ్రీదేవి పోస్టుమార్టం, ఆమె మృతదేహాన్ని భారత్ తరలించే ప్రక్రియను దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీదేవి మృతదేహాన్ని ప్రత్యేక ప్రయివేటు జెట్‌లో ముంబై తరలించనున్నారు. సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ఆ విమానం బయలుదేరే అవకాశముంది.

ఎంబామింగ్ తర్వాత డెత్ సర్టిఫికేట్

ఎంబామింగ్ తర్వాత డెత్ సర్టిఫికేట్

ప్రస్తుతం పోలీస్ మార్చురీలో శ్రీదేవి మృతదేహం ఉంది. మరో గంటన్నర వరకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. దుబాయ్‌లోని మొహాసీనాలో భౌతికకాయానికి ఎంబామింగ్ చేస్తారు. ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ జారీ చేసి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా శ్రీదేవి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.

మృతిపై భిన్న వాదనలు

మృతిపై భిన్న వాదనలు

శ్రీదేవి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి మృతి సమయంలో బోనీకపూర్ పక్కనే ఉన్నాడని ఓ వాదన ఉండగా, లేరని మరో వాదన ఉంది. దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యేలా కనిపిస్తున్నాయి.

బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. శ్రీదేవి చివరి క్షణాలు (ఫోటోలు)బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. శ్రీదేవి చివరి క్షణాలు (ఫోటోలు)

ఒక వాదన ఇది

ఒక వాదన ఇది

ఓ వాదన ప్రకారం శ్రీదేవి మరణించినప్పుడు బోనీకపూర్ కూడా హోటల్లోనే ఉన్నారు. ఆమె మరణించిన విషయాన్ని తొలుత ఆయనే గుర్తించారు. శ్రీదేవి బాత్రూంకు వెళ్లింది. పావుగంట అయినా రాకపోయేసరికి బోనీకపూర్ డోర్ కొట్టారు.

బాత్రూంలోనే శ్రీదేవి.. విషాదం ఇలా!: అతిలోక సుందరి గురించి కొన్ని విషయాలు...బాత్రూంలోనే శ్రీదేవి.. విషాదం ఇలా!: అతిలోక సుందరి గురించి కొన్ని విషయాలు...

 డోర్ తీయకపోవడంతో

డోర్ తీయకపోవడంతో

ఎంతకూ డోర్ తీయకపోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో డోర్ బద్దలు కొట్టారు. బాత్ టబ్‌లో ఆమె విగతజీవిగా పడి ఉన్నారు. ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కానీ ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఆ సమయంలో ఇది జరిగింది

ఆ సమయంలో ఇది జరిగింది

ఫిబ్రవరి 24న బోనీకపూర్ సర్ ప్రైజ్ డిన్నర్ కోసం దుబాయ్ వెళ్లారు. అతను తిరిగి హోటల్ గదికి వచ్చాక శ్రీదేవి బాత్రూంకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

బోనీ కపూర్ లేరా?

బోనీ కపూర్ లేరా?

మరో వాదనలో.. శ్రీదేవి మృతదేహాన్ని హోటల్ సిబ్బంది గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆమె చనిపోయినప్పుడు బోనీకపూర్ భారత్‌లోనే ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె మరణం పట్ల ఆమె కుటుంబ సభ్యుల్లో కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది.

వాటర్ సర్వీస్ కోసం కాల్ చేస్తే

వాటర్ సర్వీస్ కోసం కాల్ చేస్తే

బోనీ కపూర్ లేని లేని సమయంలో బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి వాటర్ సర్వీస్ కోసం కాల్ చేసింది. హోటల్ సిబ్బంది వస్తే ఆమె నుంచి స్పందన లేదు. డోర్ ఎంత కొట్టినా ఆమె స్పందించకపోవడంతో కీడు శంకించిన హోటల్ సిబ్బంది డేంజర్ అలార్మ్ మోగించారు. బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా బాత్రూంలో పడిపోయి ఉంది.

English summary
Actress Sridevi who passed away in Dubai on February 24 was quite a celebrated actress in Bollywood and was probably getting ready for her dinner date with husband Boney Kapoor who had surprised her that evening when he flew back to Dubai from Mumbai, stated reports in Khaleej Times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X