వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై మారలేదు, సమైక్యమైనా అధిష్టానానికే: ఆనం

|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూనే సమైక్యవాదం వినిపిస్తామని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి రఘువీరా రెడ్డిలతో సమావేశమైన ఆనం విభజన అంశంపై చర్చించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు.

సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా సమ్మె చేస్తున్న సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని కోరుతున్నట్లు చెప్పారు. సమ్మె కారణంగా విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్య రాష్ట్రం కోసం పోరాటం సాగిస్తామని వారు తెలిపారు. సమైక్యవాదానికి కట్టుబడి సీఎం కిరణ్ ఛాంపియన్ అయితే ఆయనకు సహకరిస్తున్న తామూ ఛాంపియన్లమేనని ఆయన అన్నారు.

పార్టీని ధిక్కరించడం లేదని, తమ అనుమానాలు నివృత్తి చేయాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం తెలంగాణ బిల్లును శాసన సభకు పంపించినప్పుడు తమ అభిప్రాయాన్ని తెలుపుతామని ఆయన అన్నారు. ఏ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆ ప్రాంత నాయకులు తమ అభిప్రాయాలను చెప్పాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారని తెలిపారు.

రాజీనామా ఆమోదించమని కోరా: ఎస్పీవై రెడ్డి

ఢిల్లీ: తన రాజీనామాను ఆమోదించమని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను కోరినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్పీవై రెడ్డి తెలిపారు. ఆయన శనివారం ఢిల్లీలో మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రానికి మద్దతుగానే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందె.

English summary
State Minister Anam Ramanarayana Reddy Said that Seemandra Congress Leaders are support United Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X