స్మార్ట్‌కాదు: బాబుపై లక్ష్మీపార్వతి, ఈ శతాబ్దానికి: పల్లె

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనను చూసి దివంగత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని ఆయన సతీమణి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆదివారం విమర్శించారు.

రాష్ట్రానికి స్మార్ట్ సిటీలు అక్కరలేదన్నారు. పేదలకు పట్టెడు అన్నం దొరికేలా చూడాలని సూచించారు. ఎన్టీఆర్ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే తెలుగు జాతి రెండుగా చీలేది కాదన్నారు. ఏడు నెలల పాలన కాలంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.

ఈ శతాబ్దానికి ఎన్టీఆరే.. ఆయన్ను దాటే వారు లేరు: పల్లె

We don't want smart cities: Laxmi Parvathi to Chandrababu

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని సమాచార పౌరసంబంధాల, సాంకేతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికహక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకే డబ్బులులేవని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లీకులు ఇస్తూ పీఆర్సీ అమలు చేయకుండా జాప్యంచేస్తోందని ఏపీపీసీసీ అధ్యక్షులు .రఘువీరా రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ దుస్థితికి కారణం కాంగ్రెస్‌ కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్సేకాదా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది మహానుభావులు ఉన్నా ఈ శతాబ్దానికి ఎన్టీఆర్‌ తర్వాతే ఎవరైనా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+