అమరావతి: మా కుటుంబంపై జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌కు చాలా గౌరవం ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. తమ కుటుంబంతో పవన్‌కళ్యాణ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు.
వైసీపీ నుండి టిడిపిలో చేరిన తర్వాత చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో భూమా అఖిలప్రియ మంత్రిపదవిని చేపట్టారు. భూమా నాగిరెడ్డి మరణంతో అఖిలప్రియను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు.
భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన నంద్యాల ఎన్నికల్లో భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతివ్వాలని భూమా కుటుంబసభ్యులు కోరారు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాత్రం ఏ పార్టీకి మద్దతును ప్రకటించలేదు. ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు.
పవన్ కోరితే సహయం చేసేందుకు రెడీ, మోడీపై భ్రమలు తొలిగాయి: జయప్రకాష్ సంచలనం

మా కుటుంబమంటే పవన్ కళ్యాణ్‌కు గౌరవం
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు తమ కుటుంబమంటే గౌరవం ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు.తమ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె తెలిపారు.

పవన్ అంటే అభిమానం
పవన్‌కళ్యాణ్ అంటే మా తల్లిదండ్రులకు చాలా అభిమానమని అఖిలప్రియ చెప్పారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి లు పవన్‌కళ్యాణ్‌పై ప్రత్యేక అభిమానాన్ని చూపేవారని ఆమె గుర్తు చేసుకొన్నారు. పిఆర్‌పిలో ఉన్న సమయంలో పవన్‌కళ్యాణ్‌ను అతి దగ్గరగా చూసినట్టు వారు చెప్పేవారన్నారు.

పవన్ సాధారణ జీవితాన్ని గడుపుతారు
పవన్ కళ్యాణ్ సాధారణ జీవితాన్ని గడుపుతారని తన తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పేవారని భూమా అఖిలప్రియ గుర్తు చేసుకొన్నారు.పవన్ కల్యాణ్ చాలా సాధారణంగా ఉంటారు .. చాలా మంచి వ్యక్తి అని భూమా నాగిరెడ్డి గారు పీఆర్పీలో ఉన్నప్పుడు మా అమ్మానాన్న ఎప్పుడూ చెబుతుండేవారని అఖిలప్రియ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

నాన్న కోరికే మేరకే పవన్ రాలేదు
2014 ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో ప్రచారానికి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది. అయితే నాన్న కోరిక మేరకే ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ రాలేదని భూమా అఖిలప్రియ ఆ ఆశీర్వాదాలు మాత్రం ఉన్నాయని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!