అవిశ్వాసానికి 150 మంది మద్దతు, సినిమాలకు, రాజకీయాలకు తేడా పవన్‌పై గంటా సెటైర్లు

విశాఖపట్నం: టిడిపి అవిశ్వాస తీర్మానానికి 150 మందికిపైగా సభ్యులు మద్దతిచ్చారని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మార్చి 19న పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు సినిమాలకు, రాజకీయాలకు తేడా ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మార్చి 19న, మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది.

ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.ఈ డిమాండ్ మేరకే ఎన్డీఏ నుండి టిడివి బయటకు వచ్చింది. ఈ తరుణంలో అవిశ్వాసానికి సంబంధించి పలు పార్టీల మద్దతును టిడిపి కూడగడుతోంది.విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు.

అవిశ్వాసానికి 150 మంది మద్దతు

అవిశ్వాసానికి 150 మంది మద్దతు

కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి తమకు 150 మంది సభ్యుల మద్దతు లభించిందని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు ఆయన గుర్తు చేశారు. తాము కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినట్టు చెప్పగానే తమకు 150 మంది ఎంపీలు మద్దతుగా వచ్చారని చెప్పారు.

సినిమాలకు, రాజకీయాలకు తేడా ఉంది

సినిమాలకు, రాజకీయాలకు తేడా ఉంది

సినిమాలకు, రాజకీయాలకు తేడా ఉందని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై , టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మోడీపై, బిజెపి గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

 తెలుగువారి ఆత్మగౌరవం కోసం బాబు పోరాటం

తెలుగువారి ఆత్మగౌరవం కోసం బాబు పోరాటం

తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పోరాట మార్గాన్ని ఎంచుకొన్నారని ఏనీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బిజెపితో కలిసినట్టు గంటా శ్రీనివాసరావు చెప్పారు.

బాబు నాయకత్వాన్ని కోరుకొంటున్న పార్టీలు

బాబు నాయకత్వాన్ని కోరుకొంటున్న పార్టీలు

దేశంలో పలు రాజకీయ పార్టీలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని కోరుకొంటున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసాన్ని టిడిపి ప్రతిపాదించినట్టుగా తెలియగానే పలు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+