నిరుద్యోగ భృతిపై ముందడుగు: ఉద్యోగ కల్పనపై నారా లోకేష్

Subscribe to Oneindia Telugu

విజయవాడ: నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీపై మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. జూలై నాటికి నిరుద్యోగ భృతి విధివిధానాలు ఖరారు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిరుద్యోగ భృతిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం సమావేశమైంది.

అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఇతర దేశాలు, రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలు జరుగుతున్న తీరుపై చర్చించామని తెలిపారు. అక్కడ అమలుచేస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు.

we looking on unemployment benefit, says Nara Lokesh

నిరుద్యోగ భృతి అర్హులకు అందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని నారా లోకేష్ తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని డేటా తయారుచేయడం ద్వారా అర్హులను గుర్తించే వీలు కలుగుతుందన్నారు.

అధ్యయనం ద్వారా మరింత స్పష్టత వస్తుందని మంత్రివర్గ బృందం అభిప్రాయ పడిందని తెలిపారు. వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వినూత్న పథకం గురించి కూడా అధ్యయనం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Nara lokesh on Wednesday said that the government looking on the unemployment benefit issue.
Please Wait while comments are loading...