వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వస్తే కిరణ్ రెడ్డిని, ఎంపిలను తీసుకుంటాం: రఘువీరా

By Pratap
|
Google Oneindia TeluguNews

We ready to invite Kiran reddy: Raghuveera Reddy
హైదరాబాద్: పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా బహిష్కరణకు గురైన పార్లమెంటు సభ్యులను, పార్టీని వీడి ననాయకులను అందరినీ తిరిగి పార్టీలో చేర్చుకుంటామని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. సోమవారం హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆవేశంతో పార్టీని వీడినవారు తిరిగి పార్టీలోకి రావచ్చునని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెసును తప్పు పట్టడం సరికాదని, రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపిన తర్వాతనే కాంగ్రెసు నిర్ణంయ తీసుకుందని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రకు కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని ఆయన విరుచుకుపడ్డారు

కిరణ్ కుమార్ రెడ్డి ఏం త్యాగం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్వలాభం కోసమే కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన విమర్శించారు సీమాంధ్ర అభివృద్ధికి కాంగ్రెసు కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీలు ఇస్తున్న హామీలను ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.

కిరణ్ కుమార్ రెడ్డి కొంత మంది బహిష్కృత పార్లమెంటు సభ్యులతో కలిసి సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.

English summary

 Andhra Pradesh PCC president N Raghuveera Reddy said that he will ready to to take former CM Kiran kumar Reddy and other MPs into Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X