వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేద విద్యార్థులకు సాయం చేయాలి: లోకేష్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం పట్టణాలకొచ్చే నిరుపేద విద్యార్థులకు సాయం చేసేందుకు నిరంతరం అందుబాటులో ఉండాలని టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ సూచించారు. ఎన్టీఆర్ భవన్‌లో గురువారం టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ ఆధ్వర్యంలో కమిటీ రూపొందించిన విద్యార్థుల స్వాగత గోడ పత్రికల్ని ఆయన విడుదల చేశారు.

సివిల్స్ లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రెండు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రతిభ కనబరిచేలా పేద విద్యార్థులను ప్రోత్సహించాలని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. నల్లధనాన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్రం చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకుని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ అవినీతి తిమింగలాలను సమాజం చీదరించుకునేలా వాస్తవాలను యువతకు తెలియజేయాలన్నారు.

1956 స్థానికత నిబంధన సాకు పెట్టి దళిత, పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లు నిరాకరించడం కెసిఆర్ ప్రభుత్వానికి తగదని ఆంజనేయగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి బ్రహ్మం చౌదరి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు రాజేష్, వెంకటప్ప, దినేష్, కిరణ్ గౌడ్, బాబూలాల్ నాయక్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, ప్రసాద్, సాయి, శివ, తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల యోగక్షేమాలను తెలుసుకోవడంలో భాగంగా గురువారం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన లోకేష్.. పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులను కలుకున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాపునాడు సెక్రటరీ, టిడిపి నగర ఉపాధ్యక్షుడు మండపాక సుబ్బు రూ. 10వేలు టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళంగా అందజేశారని టిడిపి మీడియా కమిటీ ఛైర్మన్ ప్రసాద్ తెలిపారు.

నారా లోకేష్

నారా లోకేష్

గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం పట్టణాలకొచ్చే నిరుపేద విద్యార్థులకు సాయం చేసేందుకు నిరంతరం అందుబాటులో ఉండాలని టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ సూచించారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఎన్టీఆర్ భవన్‌లో గురువారం టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ ఆధ్వర్యంలో కమిటీ రూపొందించిన విద్యార్థుల స్వాగత గోడ పత్రికల్ని ఆయన విడుదల చేశారు.

నారా లోకేష్

నారా లోకేష్

సివిల్స్ లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రెండు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రతిభ కనబరిచేలా పేద విద్యార్థులను ప్రోత్సహించాలని లోకేష్ అన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

తూర్పుగోదావరి జిల్లా కాపునాడు సెక్రటరీ, టిడిపి నగర ఉపాధ్యక్షుడు మండపాక సుబ్బు రూ. 10వేలు టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళంగా అందజేశారని టిడిపి మీడియా కమిటీ ఛైర్మన్ ప్రసాద్ తెలిపారు.

English summary
Telugudesam Party Workers' welfare fund Co-ordinator Nara Lokesh on Friday said that they should help to poor students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X