స్వచ్ఛ హైదరాబాద్‌: 1000 కోట్లు, సినీనటుల సేవలు వాడుకుంటామన్న కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్‌, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు.

హైదరాబాద్ నగర అభివృద్ధిపై బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహిచారు. రూ. 1000 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చాలని సీఎం నిర్ణయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భాగ్యనగరాన్ని 400 భాగాలుగా విభజిస్తామని అన్నారు.

 kcr

ప్రతి భాగానికి ఒక్కో ప్రముఖుడు ఇన్‌చార్జ్‌గా 15 మందితో కమిటీని ఏర్పాటు చేస్తామని, వాటిలో కొన్ని ప్రాంతాలకు గవర్నర్‌, సీఎం, సీఎస్‌ ఇన్‌చార్జ్‌లుగా ఉంటారని ఆయన చెప్పారు.

మే 6 నుంచి స్వచ్ఛ హైదరాబాద్‌పై అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మే 16నుంచి 20 వరకూ నిర్వహించే స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని గవర్నర్‌ నరసింహాన్ ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు.

నగర అభివృద్ధి, పరిశుభ్రతలో పౌరులందరి భాగస్వామ్యం కావాలని సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో సినీ నటులు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖుల సేవలు వినియోగించుకుంటామని చెప్పారు.

హైదరాబాద్‌లో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రెండు వేల ఎకరాల భూమిని సేకరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం హైదరాబాద్‌లో పేదల గృహనిర్మాణాలపై సమీక్షను నిర్వహించారు.

ఇందులో భాగంగా భూ సేకరణ జరిపిన తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకుని రెండు లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+