చంద్రబాబుకు మద్దతు ఇస్తాం: రఘువీరా రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ సెగ కేంద్రానికి తగిలిందని ఏపీపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన విశాఖ, శ్రీకాకుళంలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలోనూ మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఏ రాష్ట్రానికి చేయని విధంగా పలు ప్రయోజనాలను విభజన బిల్లులో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తే నేడు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీలో చెట్టపట్టాలేసుకొని వాటిని సాధించుకోవటంలో విఫలమవుతున్నారన్నారు.
అధికారం చేపట్టి ఎనిమిది నెలలైనా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు హక్కుల కోసం కోరడం లేదన్నారు. రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేకహోదాను తాము అధికారంలోకి వస్తే మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తామన్నారు.
అంతేకాకుండా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. విభజన జరిగిన తరువాత ప్రధానిని కలిసిన సోనియా గాంధీ విభజన చట్టాన్ని తూచ తప్పకుండా అమలు చేయాలన్నారు.
చంద్రబాబు 24,350 కోట్ల రూపాయల సాయం కావాలని కేంద్రాన్ని కోరితే, కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే విదిల్చిందన్నారు. కేంద్రం చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయన్నారు. వీటన్నింటినీ సాధించేందుకు, కేంద్రంపై వత్తిడి తేవడానికి తమ వంతు బాధ్యతగా కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఆరంభించిన వెంటనే కేంద్రం స్పందించి రూ.500 కోట్ల విడుదల చేసిందన్నారు.

కాంగ్రెస్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ సెగ కేంద్రానికి తగిలిందని ఏపీపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్
సోమవారం విశాఖపట్నం, శ్రీకాకుళంలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో ఏపీపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్
రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఏ రాష్ట్రానికి చేయని విధంగా పలు ప్రయోజనాలను విభజన బిల్లులో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తే నేడు చంద్రబాబు బీజేపీలో చెట్టపట్టాలేసుకొని వాటిని సాధించుకోవటంలో విఫలమవుతున్నారన్నారు.

కాంగ్రెస్
అధికారం చేపట్టి ఎనిమిది నెలలైనా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు హక్కుల కోసం కోరడం లేదని రఘువీరా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications