Southwest Monsoon: మూడు రోజులు వర్షాలు, ఆపై వడగాలులు!

ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఒకేసారి అటు చల్లని కబురు, ఇటు వేడి హెచ్చరికను అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల గమనం ఊపందుకుంది. ఈ ఏడాది కాస్త ముందుగానే రుతుపవనాలు భారత గడ్డను తాకనున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు సోమవారం (మే 18) నాటికి అండమాన్ & నికోబార్ దీవులతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరించాయి. రాబోయే 3-4 రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మే 26వ తేదీ నాటికి (నాలుగు రోజులు అటు ఇటుగా) రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు, నైరుతి రుతుపవనాల కదలికలతో పాటు ఏపీపై ప్రత్యేక వాతావరణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో బలమైన ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడు.. దక్షిణ లక్షద్వీప్ ప్రాంతం నుండి కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటన్నిటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Weather Alert Southwest Monsoon Advances Early as IMD Forecasts Heavy Rains and Sudden Heatwaves in AP

మూడు రోజుల పాటు వర్షాలు.. గాలుల బీభత్సం!

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా గంటకు 30 నుండి గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ప్రాంతాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి..

కోస్తా ఆంధ్రాకు వరద గండం! ఎల్ నినో సృష్టించనున్న వాతావరణ బీభత్సం
కోస్తా ఆంధ్రాకు వరద గండం! ఎల్ నినో సృష్టించనున్న వాతావరణ బీభత్సం

ఉత్తర కోస్తా ఆంధ్ర & యానాం:

సోమ, మంగళవారాల్లో గంటకు 30-40 కి.మీ, బుధవారం నాటికి 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు.

దక్షిణ కోస్తా ఆంధ్ర:

ఇక్కడ గాలి వేగం క్రమంగా పుంజుకోనుంది. సోమవారం 30-40 కి.మీ, మంగళవారం 40-50 కి.మీ, బుధవారం నాటికి అత్యంత గరిష్టంగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:

కోస్తా తరహాలోనే రాయలసీమలోనూ బుధవారం నాటికి గాలి వేగం పెరగనుంది. చివరి రోజున ఇక్కడ కూడా గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుంది.

ముందస్తు హెచ్చరిక: ఉక్కపోత.. ఆపై వడగాలుల తీవ్రత!

వర్షాల సూచన ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రజలు ఎండల తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్పష్టం చేశారు. మంగళవారం కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో విపరీతమైన వేడి, తేమతో కూడిన అసౌకర్యవంతమైన వాతావరణం (ఉక్కపోత) ఏర్పడుతుంది. ఆ తర్వాత రాగల ఐదు రోజుల్లో కోస్తాలో ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వడగాలులు (Heat Waves) వీచే ప్రమాదం ఉంది.

ఎండాకాలంలో వానలు.. మూడ్రోజుల పాటు ఆ జిల్లాల్లో వర్షాలు
ఎండాకాలంలో వానలు.. మూడ్రోజుల పాటు ఆ జిల్లాల్లో వర్షాలు

ఇక రాయలసీమ రీజియన్‌లో రాబోయే ఐదు రోజుల పాటు భానుడు ప్రతాపం చూపించనున్నాడు. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+