హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో మాండూస్ తర్వాత మెగా ముప్పు: ఏపీ, తెలంగాణ 3 రోజులపాటు వర్షాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి:మాండూస్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో భారీ పంట, ఆస్తి నష్టం జరిగింది. దీంతో చేతికందిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో బీభత్సం సృష్టించిన మండూస్ తుపాను

ఏపీలో బీభత్సం సృష్టించిన మండూస్ తుపాను


మరోవైపు, రానున్న మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే మాండూస్ తుఫాను కారణంగా ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ తుపాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆస్తి నష్టం కూడా జరిగింది.

భారీ వర్షాలతో ఆందోళనలో రైతాంగం: ఇప్పుడు మెగా ముప్పు

భారీ వర్షాలతో ఆందోళనలో రైతాంగం: ఇప్పుడు మెగా ముప్పు

ఇది ఇలావుంటే, మాండూస్ తగ్గగానే తెలుగు రాష్ట్రాలకు మోగా తుపాను ముప్పు పొంచివుంది. రెండు రోజుల్లో మోగా తుపాను విరుచుకుపడుతుందని వాతావ‌ర‌ణ‌శాఖ ప్రకటించింది. దీంతో రైతులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురవుతున్నారు. ఇప్పటికే చాలా పంట నష్టపోయామని, మళ్లీ వర్షాలు పడితే కోలుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముసురులో తెలంగాణ, మోస్తరు వర్ష సూచన

ముసురులో తెలంగాణ, మోస్తరు వర్ష సూచన

ఇక, తెలంగాణలోను మాండూస్ ఎఫెక్ట్ పడింది. గత రెండురోజులుగా హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో తేలికాపటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అంతేగాక, హైదరాబాద్ నగరం, ఇతర జిల్లాలు కూడా ముసురుపట్టిన వాతావరణాన్ని అనుభవించాయి. మరోవైపు, రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరిక జారీ చేసింది.

English summary
Weather: next three days rains in AP and Telangana, after Mondus cyclone, now ready mega cyclone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X