weather: ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు, ఉష్ణోగ్రతలూ అధికమే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ఫలితంగా రాగల మూడు రోజులపాటు వాతావరణ మార్పులు చోటు చేసుకోనున్నాయని పేర్కొన్నారు.
ఉత్తరకోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో సోమవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండనుంది.

దక్షిణకోస్తాంధ్ర నేటి నుంచి మూడు రోజులపాటు పొడి వాతావరణం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 సెంట్రిగ్రేడ్ సాధారం కంటే ఎక్కువ ఒకటి రెండు చోట్ల నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండో చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురరుస్తాయి.












Click it and Unblock the Notifications