యాస్ ఎఫెక్ట్: ఏపీలో వాతావరణ మార్పులు: వర్షాలతోపాటు అధిక ఉష్ణోగ్రతలు
అమరావతి: యాస్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని వాతావరణం కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాగల రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్రలో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉండనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉత్తర కోస్తాంధ్రలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదు కానున్నాయి.

దక్షిణ కోస్తాంధ్రలో శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే సాధారణం కంటే 2-4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకానున్నాయని తెలిపింది. శనివారం ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
Recommended Video
ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, యాస్ తుఫాను కారణంగా పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. వేలాది ఇళ్లు ధ్వసమయ్యాయి. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుమారు పది మంది మరణించారు. తుఫాను విలయం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన నష్టంపై శుక్రవారం సమీక్షించనున్నారు.












Click it and Unblock the Notifications