అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోటోలు: బెజవాడలో కెసిఆర్‌కు టిడిపి బ్యానర్లు, చిచ్చుపెట్టాడని అవినాష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ/అమరావతి: ఈ నెల 22వ తేదీన (గురువారం నాడు) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వస్తున్న నేపథ్యంలో విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేత ఒకరు... కెసిఆర్‌కు స్వాగత బ్యానర్లు కట్టారు.

విజయవాడకు చెందిన తెలుగుదేశం నాయకుడు కాట్రగడ్డ బాబు బ్యానర్లు ఏర్పాటు చేశారు. మంగళవారం విజయవాడ శివారు ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ప్రాంతాలతో పాటు నగరంలోని ప్రకాశం బ్యారేజీ, బెంజి సర్కిల్ సహా పలుచోట్ల వీటిని ఏర్పాటు చేశారు.

స్వాగత బ్యానర్లు

స్వాగత బ్యానర్లు

అమరావతి శంకుస్థాపనకు వస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌కు విజయవాడలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో కెసిఆర్‌కు బాబు ఆహ్వాన పత్రిక ఇస్తున్న ఫోటోను పెట్టారు.

స్వాగత బ్యానర్లు

స్వాగత బ్యానర్లు

అమరావతి శంకుస్థాపనకు వస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌కు విజయవాడలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగత బ్యానర్ దృశ్యం.

స్వాగత బ్యానర్లు

స్వాగత బ్యానర్లు

అమరావతి శంకుస్థాపనకు వస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌కు విజయవాడలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో కెసిఆర్‌కు బాబు ఆహ్వాన పత్రిక ఇస్తున్న ఫోటోను పెట్టారు.

స్వాగత బ్యానర్లు

స్వాగత బ్యానర్లు

అమరావతి శంకుస్థాపనకు వస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌కు విజయవాడలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో కెసిఆర్‌కు బాబు ఆహ్వాన పత్రిక ఇస్తున్న ఫోటోను పెట్టారు.

అమరావతికి కేసీఆర్ రాకపట్ల వ్యతిరేకత!

కెసిఆర్ అమరావతికి రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు యూత్ కాంగ్రెస్ వెల్లడించింది. రాష్ట్ర విభజనకు కారణమైన, తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కేసీఆర్‌ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ తప్పుబట్టారు.

ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే కెసిఆర్‌కు చంద్రబాబు స్వాగతం పలుకుతున్నారని ఆరోపించారు. శంకుస్థాపనకు పిలవడాన్ని తప్పుబట్టారు. మరోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఇద్దరు చంద్రుల సమావేశాన్ని ఓ డ్రామాగా అభివర్ణించారు.

ఉత్సాహం విరిసిన పల్లెలు

అమరావతి శంకుస్థాపన వేడుకతో నదీతీరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. శంకుస్థాపన ప్రాంగణం తీర్థస్థలిగా మారింది. జీవన సంధ్యలో ఉన్నవారి నుంచి నవతరం వరకూ అన్ని తరాలవారూ కళ్లారా రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని వీక్షించేందుకు దూరప్రాంతాల నుంచి ఉద్దండరాయునిపాలెంకు వస్తున్నారు.

సకుటుంబ సపరివార సమేతంగా తరలి వస్తున్నారు. మరోవైపు రాజధాని గ్రామాల్లో ఎటు చూసినా పండగ వాతావరణమే కనిపిస్తోంది.

రాష్ట్రం నలుమూలల నుంచీ వస్తున్న మన నీరు - మన మట్టి వాహనాలకు స్వాగతం పలుకుతూ సంకల్ప జ్యోతి వూరేగింపులతో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నవారికీ, ఉద్యోగవిధుల్లో భాగంగా వచ్చినవాళ్లకీ అవసరమైన ఆహారపానీయాలు అందిస్తూ రైతులు తమ ఇంట్లో వేడుకలా చేస్తున్నారు.

రేపు రావడం కష్టమని కొందరు ముందే తరలి వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు ముందుగానే ప్రాంగణాలను చేరుకుంటున్నారు. ఏర్పాట్లు చూసేందుకు కూడా భారీగా తరలి వస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలకు చెందినవాళ్లు, విజయవాడలో అమ్మవారి దర్శనానికీ వచ్చినవాళ్లు రాజధాని నిర్మాణ ప్రాంతానికి వస్తున్నారు.

English summary
Welcome banners in Vijayawada to Telangana State CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X