వర్షం లోనే జగన్‌ పాదయాత్ర:182వ రోజు...తణుకు నుంచి నడిపల్లి దాకా

పశ్చిమ గోదావరి: వైసిపి అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జగన్‌ బుధవారం తన 182 వ రోజు పాదయాత్రను తణుకు శివారు నుంచి ప్రారంభించారు.

Recommended Video

    మరో చరిత్ర సృష్టించనున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర

    అయితే ఈ ఉదయం నుంచే తణుకులో భారీ వర్షం కురుస్తుండగా పాదయాత్ర ఆరంభానికి ఆటంకం ఏర్పడింది. అయితే వేచిచూసినా వర్షం తగ్గకపోతుండటంతో జగన్ వర్షంలోనే తన పాదయాత్రను కొనసాగించారు. వర్షంలో నడక సాగిస్తున్న జగన్ ను ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అనుసరిస్తుండగా తనని కలసి మాట్లాడేందుకు వస్తున్న జనాల సమస్యలు తెలుసుకుంటూ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

    West Godavari:Jagan continues his padayatra in rain

    జగన్ 182 వ రోజు ప్రజాసంకల్ప యాత్ర తణుకు శివారు నుంచి మొదలై పాదయాత్ర నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఉండ్రాజవరం మండలం పాలంగి, ఉండ్రాజవరం మీదుగా చిలకపాడు క్రాస్‌ రోడ్డు చేరుకున్న తర్వాత అక్కడ జగన్‌ భోజన విరామం తీసుకోనున్నారు. ఆ తర్వాత మోర్తా, దమ్మెన్ను మీదుగా నడిపల్లి కోట చేరుకున్న తర్వాత నేటి పాదయాత్ర ముగియనుంది. జగన్ బుధవారం రాత్రికి నడిపల్లిలోనే బస చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+