పులివెందుల రిజల్ట్ పై అంబటి ఏసేశాడు..బాగా ఏసేశాడు
Pulivendula and Vontimitta ZPTC bypoll results: ఊహించినట్టే- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 12వ తేదీన జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను కోల్పోయింది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ పాగా వేసింది.
వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది. మొత్తం 6,033 ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి లతా రెడ్డి ఇక్కడ గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల హేమంత్ రెడ్డి పరాజయాన్ని చవి చూశారు.

టీడీపీకి 6,716 ఓట్లు పడ్డాయి. వైఎస్ఆర్సీపీకి 683 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ విజయంతో 30 సంవత్సరాల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నట్టయింది. ఈ విజయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సవిత హర్షం వ్యక్తం చేశారు. లతారెడ్డికి చంద్రబాబు ఫోన్ చేశారు. ఆమెను అభినందించారు.
పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరిందని అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ సొంత గడ్డపై వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని అన్నారు. పులివెందుల ప్రజలు జగన్‌పై ఎంత కసిగా ఉన్నారో ఈ విజయంతో అర్థమౌతోందని పేర్కొన్నారు. అవినీతి, అరాచకానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు.
అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలోనూ ఇదే ఫలితం వెలువడింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని 6,267 ఓట్ల తేడాతో ఓడించారు. కృష్ణారెడ్డి కి 12,505 ఓట్లు పోల్ అయ్యాయి. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,351 ఓట్లు పడ్డాయి.
ఈ ఉప ఎన్నికల ఫలితాల పట్ల వైఎస్ఆర్సీపీకి చెందిన కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. పోలీసులు, గుండాలతో దొంగ ఓటింగ్ నిర్వహించారని, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని కనీసం పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా ఈ ఎన్నికలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్వహించిందని విమర్శించారు. వీటిని ఎన్నికలు అని ఎలా అంటారని ప్రశ్నించారు.
తాజాగా- వైఎస్ఆర్సీపీకే చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తనదైన శైలిలో ఈ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. సీనియర్ ఐపీఎస్ అధికారి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కు అంకింతం అని ఓ ట్వీట్ పెట్టారు.












Click it and Unblock the Notifications