జగన్ ఆవేదన అర్ధం చేసుకోదగిందే- కానీ భారతిని మంత్రులు వెనకేసుకొచ్చి ఉంటే...!

తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ తన మంత్రులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి కారణం విపక్షాలు తన భార్య వైఎస్ భారతిపై విమర్శలు చేస్తున్నా స్పందించకపోవడమే. గతంలోనూ ఇలాగే విపక్షాలు పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా మంత్రులు స్పందించకపోవడం పట్ల జగన్ అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం జగన్ మంత్రులు మాట్లాడకపోవడం వల్ల రాజకీయంగా తనకు లేదా తన పార్టీ వైసీపీకి నష్టం జరుగుతుందని సీఎం భావిస్తున్నారు. కానీ ఇందులోనే మరో కోణం ఉంది.

 మంత్రులపై జగన్ అసహనం

మంత్రులపై జగన్ అసహనం

తాజాగా కేబినెట్ భేటీలో తన మంత్రులపై సీఎం జగన్ వ్యక్తం చేసిన ఆగ్రహం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇందుకు కారణమైన టీడీపీ విమర్శలు కూడా చర్చకు దారి తీస్తున్నాయి. అయితే ఎక్కడో ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణాన్ని వైఎస్ భారతి, విజయసాయిరెడ్డికి అంటగడుతూ టీడీపీ చేసిన విమర్శలపై తన మంత్రులు స్పందించకపోవడమేంటని జగన్ వేసిన ప్రశ్న మంత్రుల్ని సైతం ఆలోచనలో పడేసింది. దీనిపై తాము స్పందించలేదంటూ జగన్ ప్రశ్నించిన తర్వాత మంత్రుల్లోనూ అంతర్మథనం సాగుతోంది.

మంత్రులు స్పందించి ఉంటే..

మంత్రులు స్పందించి ఉంటే..

అయితే కేబినెట్ భేటీలో మంత్రులపై జగన్ అసహనం గురించి తెలిసిన తర్వాత వైసీపీ నేతలతో పాటు ఇతర పార్టీల్లోనూ ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్ భారతి గురించి టీడీపీలో ద్వితీయశ్రేణి నేతలు చేసిన ఆరోపణలపై తాము స్పందించి ఉంటే ఈ వ్యవహారం మరో మలుపు తీసుకునేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారతిని వెనకేసుకొచ్చేలా తాము స్పందించి ఉంటే అది అంతిమంగా రాజకీయంగా పెద్ద చర్చకు తావిచ్చేదన్న అభిప్రాయం మంత్రులతో పాటు వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన పలు ఘటనల్ని వారు ఇందుకు ఉదాహరణగా గుర్తుచేస్తున్నారు.

తేనెతుట్టె కదిపినట్లేనా ?

తేనెతుట్టె కదిపినట్లేనా ?


ఏపీలో గత మూడేళ్లుగా వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న రాజకీయాన్ని దగ్గరి నుంచి చూసిన వారెవరికైనా ఓ అంశంలో మాత్రం పూర్తిగా క్లారిటీ ఉంది. అది ప్రత్యర్ధి పార్టీలు తమపై ఓ చిన్న విమర్శ చేసినప్పుడు దానికి వెంటనే రియాక్ట్ అయి ఖండన ఇవ్వడమో ఎదురుదాడి చేయడమో చేస్తే వారు తమ దాడిని మరింత ముమ్మరం చేయడం ఖాయం. అధికారంలో ఉన్న పార్టీలకు అది మరింత తలనొప్పిగా మారడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతంలో ఏపీలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంతో పాటు మరికొన్నిఅంశాల్లో విపక్షాల విమర్శలకు మంత్రులు, వైసీపీనేతలు స్పందించి వాటిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. ఇప్పుడు కూడా భారతిపై చర్చకు తావిచ్చేలా తాము స్పందిస్తే ఇబ్బందులు తప్పవని మంత్రులు భావించి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.కానీ జగన్ మాత్రం ప్రత్యర్ధులకు సరైన కౌంటర్ ఇవ్వలేదనే ఆవేదనతో మంత్రులపై సీరియస్ అయ్యారు. తద్వారా ఆయన కూడా ఈ తేనెతుట్టెను కదిపినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+