Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ చేసే వారాహి దీక్ష ప్రాశస్త్యం ఏమిటి? పవన్ దేనికోసం దీక్ష చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్న విషయం తెలిసిందే. జూన్ 26 నుండి 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ వారాహి దీక్షను నిర్వహించనున్నారు. ఇక దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వారాహి దీక్ష అంటే ఏమిటి అసలు ఎందుకు చేస్తారు? చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వారాహి అమ్మవారు ఎవరంటే
వారాహి దీక్ష అంటే వారాహి అమ్మవారిని ఉపాసించడం.. మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలని సప్తమాతృకలుగా చెప్తారు. ఆమె ఏడు ప్రతి రూపాలను సప్తమాతృకలు అంటారు. దుర్గాదేవి సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శంభుని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించటంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని చెబుతారు.

what is Pawan Kalyan Varahi Deeksha importance why is Pawan doing this

వారాహి రూపమిలా
వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉన్న ముఖంతో ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు. అమ్మవారి ఎనిమిది చేతులలోనూ శంఖువు, చక్రం, నాగలి, పాశం వంటి అనేక ఆయుధాలు దర్శనమిస్తాయి. ఇక వారాహి అమ్మవారు దున్నపోతు, సింహం, పాము, గుర్రం వంటి వాహనాల మీద సంచరిస్తారని పురాణాలలో తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో అసలు వారాహి అమ్మవారి ప్రస్తావనను తీసుకువచ్చి వారాహి అమ్మవారి విశేషాలను అందరూ తెలుసుకునేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ నే.

వారాహి అమ్మవారిని పూజించేది ఇందుకే
ఇక వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే శత్రువులను జయించడానికి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారిని పూజించిన వారికి శత్రుభయం ఉండదని చెబుతారు. అంతేకాదు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుండి మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి కూడా వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. ప్రతి సంవత్సరం జేష్ట మాసం చివరిలో ఆషాడమాసం మొదట్లో వారాహి అమ్మవారి దీక్షను చేపడుతారు.

వారాహి దీక్షను పాటించాలిలా
వారాహి దీక్షలో భాగంగా అమ్మవారిని పూజించడానికి ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి, రెండు పూటలా అమ్మవారిని పూజ చేసుకుంటూ, సాత్విక ఆహారం తీసుకొని, నేలపై పడుకుని అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ వారాహి దీక్షను ఆచరిస్తారు. సాధారణంగా వారాహి దీక్షను తొమ్మిది రోజులైనా, 11 రోజులైనా చేయొచ్చు.

పాలనకు అవాంతరాలు రాకుండా వారాహి దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పాలనకు ఎటువంటి అవాంతరాలు రాకూడదని 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తాను తిరిగే ప్రచార వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టుకున్నారు. అన్ని సమస్యలను వారాహి అమ్మవారు పరిష్కరించి తిరుగులేని విజయాలను ఇస్తారని ఆయన వారాహి దీక్ష చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+