విజయమ్మ రాజీనామా - సీఎం జగన్ ఉద్వేగం : నాడు షర్మిల - వైసీపీకి నష్టమేనా..!!

వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేసారు. తన ఇద్దరు పిల్లలతో ఇప్పుడు ఎవరితో ఉండాలనే పరిస్థితి గురించి పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. తన రాజీనామా నిర్ణయానికి కారణాలను తానే వెల్లడించటం ద్వారా, ఊహగానాలకు - ప్రచారాలకు ముగింపు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. జగన్ కష్టాల్లో ఉన్న సమయంలో తనతో పాటుగా షర్మిల సైతం మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసారు. తన తండ్రి ఆశయ సాధన కోసం ఇప్పుడు షర్మిల తెలంగాణలో రాజకీయంగా పోరాటం చేస్తున్నారని వివరించారు. జగన్ సంతోషంగా ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే తన రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసినదాన్ని అవుతానేమోనని తన మనస్సాక్షి చెబుతోందంటూ మనసులో మాటలను షేర్ చేసుకున్నారు.

విజయమ్మ నిర్ణయంతో ఒక్క సారిగా

విజయమ్మ నిర్ణయంతో ఒక్క సారిగా


పదే పదే హాజరైన పార్టీ సభ్యులను తన కుటుంబ సభ్యులుగా ప్రస్తావిస్తూ.. తన ఆలోచన ఏంటనేది బహిర్గతం చేసారు. అయితే, విజయమ్మ రాజీనామా అంశం పైన ముందుగానే జగన్ తో చర్చించినట్లు సమాచారం. మరిన్ని ఆపోహలకు..విమర్శలకు తావు లేకుండా ప్లీనరీ వేదికగానే ప్రకటన చేయాలని నిర్ణయానికి వచ్చారు. కారణాలు ఏవైనా... తన రాజీనామా వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని..తన ఇద్దరు పిల్లలు వేర్వేరుగా రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా పోరాటం చేయటం పైన విజయమ్మ ఎంత ఆందోళనతో ఉన్నారో వేదిక ద్వారా స్పష్టం చేసారు. ఇక, తన రాజీనామా నిర్ణయం ప్రకటించిన సమయంలో ఎమోషనల్ అయిన విజయమ్మ..తన ప్రసంగం ముగిసిన తరువాత జగన్ దగ్గరకు తీసుకోవటంతో కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి ప్రసంగంతో సీఎం జగన్ సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఉదయం తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన సమయంలోనూ జగన్ ఎమోషనల్ గా కనిపించారు.

నాడు షర్మిల.. నేడు తల్లి డెసిషన్ తో

నాడు షర్మిల.. నేడు తల్లి డెసిషన్ తో

ఇలా.. తొలుత జగనన్న వదిలిన బాణంగా చెప్పుకొనే షర్మిల..ఇప్పుడు గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉంటూ.. ఇప్పుడు తల్లి విజయమ్మ తనకు దూరం కావటంతో జగన్ ఈ ఉద్వేగానికి లోనయినట్లుగా కనిపిస్తోంది. అయితే, రాజకీయంగా చెల్లి - తల్లిని దూరం చేసుకున్న వ్యక్తిగా సీఎం జగన్ పైన విమర్శలు మొదలయ్యాయి. బాబాయ్ వివేకా హత్య కేసులో సోదరి అయిన సునీతకు న్యాయం చేయటం లేదంటూ టీడీపీ ఇప్పటికే విమర్శలు చేస్తోంది. ఇక, చెల్లి షర్మిల గతంలో జగన్ కోసం పాదయాత్ర..ఎన్నికల ప్రచారం వంటివి నిర్వహించి.. తెలంగాణలో రాజకీయం కోసం దూరమయ్యారు. ఇప్పుడు కుమార్తె - కుమారుడు ఎవరితో ఉండాలనే సంకట స్థితి నుంచి కుమార్తె వైపే విజయమ్మ మొగ్గు చూపారు. విజయమ్మ నిర్ణయంతో ఒక్క సారిగా ప్లీనరీ ప్రాంగణంలో వైసీపీ శ్రేణులు ఆలోచన లో పడ్డారు. కొంత మంది సీనియర్లు విజయమ్మ నిర్ణయం పైన వెంటనే స్పందించేందుకు నిరాకరించారు.

పార్టీ పైన ఏ మేర ప్రభావం

పార్టీ పైన ఏ మేర ప్రభావం


విజయమ్మ పార్టీ వీడటం తమకు ఎమోషనల్ గా నష్టం చేస్తుందని అంగీకరిస్తున్నారు. ఒక నాడు జగన్ కోసం వీధుల్లోకి వచ్చి జనం మధ్య నుంచి మద్దతు కోరిన విజయమ్మ -షర్మిల ఇప్పుడు ఒక విధంగా మద్దతు పరంగా జగన్ కు దూరమయ్యారు. రాజకీయంగా ఇప్పుడు జగన్..తన పార్టీ నేతల మద్దతుతోనే ముందుకు వెళ్లాల్సి ఉంది. అయితే, షర్మిల.. ఇప్పుడు విజయమ్మ వైసీపీని కాదని నిర్ణయాలు తీసుకోవటం పార్టీకి ప్రత్యక్షంగా కాకపోయినా..జగన్ పైన వ్యక్తిగతంగా ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. రాజకీయ వ్యతిరేకులకు అస్త్రాలుగా మారనున్నాయి. తల్లి సైతం జగన్ ను కాదనుకొని వెళ్లిపోయారంటూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి. అయితే, తన తల్లి నిర్ణయం.. మొత్తం పరిస్థితుల పైన ప్లీనరీ ముగింపు సమావేశంలో సీఎం జగన్ క్లియర్ చేసేలా మాట్లాడుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే..జగన్ సొంత కుటుంబ సభ్యులే పార్టీకి దూరం కావటం ఏ మేర పార్టీ పైన ప్రభావం చూపుతుందనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+