వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి డెసిషన్ వెనుక - ఆ రాజీ నచ్చటంలేదా..!?

|
Google Oneindia TeluguNews

మెగా ఫ్యాన్స్ కు పండుగ మొదలైంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరి కొద్ది గంటల్లో విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి సినిమా గురించి ఆసక్తి కర అంశాలు వెల్లడించారు. కానీ, ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలకు ప్రాధాన్యత కనిపించింది. అందులో ప్రధానంగా ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వార్తే ప్రముఖంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జనసేనకు చిరంజీవి మద్దతు ఉందని గతంలో మనోహర్.. తాజాగా గాడ్ ఫాదర్ విడుదల సమయంలో తమ్ముడు పవన్ కు తన మద్దతు ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటనే విశ్లేషణలు మొదలయ్యాయి.

చిరంజీవి ఇప్పటికే పలు మార్లు రాజకీయాలకు దూరంగా ఉన్నానని స్పష్టం చేసారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఏపీలో ఓటు లేదని..ఏపీ రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఒక ఎక్కడా జోక్యం చేసుకోవాలని తాను అనుకోవటం లేదని క్లారిటీ ఇచ్చారు. తమ్ముడు రాజీ పడటమే..అన్నయ్యకు రాజకీయాల పట్ల విరక్తి కలిగిందేమో అంటూ మంత్రి అంబటి ట్వీట్ చేసారు. తాజాగా చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది.

What made Chiranjeevi stay away from politics when Pawan Kalyan lead Janasena is active in AP-Analysis

జరుగుతున్న పరిణామాలతోనే తాను రాజకీయంగా ఎవరికీ టార్గెట్ కావటం ఇష్టం లేకనే ఈ వ్యాఖ్యలు చేసారనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఏపీలో మొదలైన ఎన్నికల వాతావరణం లో వైసీపీ నేతలు ప్రధానంగా జనసేనను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా మెగా బ్రదర్స్ పైన చేసిన ఆరోపణల్లో చిరంజీవి గురించి ప్రస్తావన చేసారు. దీని పైన విమర్శలు వినిపించాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ - చిరంజీవి మధ్య సత్సంబంధాలే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా చిరంజీవి గురించి వైసీపీ నేతలు ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇప్పుడు చిరంజీవి కూడా జనసేనకు మద్దతిస్తున్నారనే వార్తల నేపథ్యంలో రోజా లాంటి వారు చిరంజీవి పైన విమర్శలు ప్రారంభించారు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయిన తాను రాజకీయంగా వివాదాలకు అవకాశం ఇవ్వకూడదనే చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక, వాల్తేరు

English summary
Mega Star Chiranjeevi Interesting comments on his relation with AP Politics lead to many specualtions, Waltair Veerayya to release on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X