Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిట్ అండ్ ఫైన్: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణానికి కారణాలేంటీ?: పోస్ట్ కోవిడ్ ప్రభావమా?

అమరావతి: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా కన్నుమూయడం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున మొన్నటిదాకా దుబాయ్‌ ఎక్స్‌పోలో తీరిక లేకుండా గడిపిన ఆయన ఇవ్వాళ లేరు అనే విషయాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేకపాటి కుటుంబం అభిమానులు జీర్ణించుకోలేకపోతోన్నారు. శారీరకంగా ఎంతో దృఢంగా ఉండే గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడవడంతో శోక సముద్రంలో మునిగిపోయారు.

Recommended Video

    Mekapati Goutham Reddy ప్రస్థానం.. గౌతమ్ రెడ్డి ఇమేజ్ ప్రత్యేకం|Andhra Pradesh | Oneindia Telugu
    రాజకీయ కుటుంబం నుంచి..

    రాజకీయ కుటుంబం నుంచి..

    మేకపాటి గౌతమ్ రెడ్డి వయస్సు 50 సంవత్సరాలు. 1971 నవంబర్ 2వ తేదీన ఆయన నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో జన్మించారు. గౌతమ్ రెడ్డిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. అయిదుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యాన్ని వహించారు. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    వైసీపీ తొలి కేబినెట్‌లో

    వైసీపీ తొలి కేబినెట్‌లో

    తన రాజకీయ వారసుడిగా కుమారుడు గౌతమ్ రెడ్డిని తెరమీదికి తీసుకొచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి గౌతమ్ రెడ్డి ఎన్నికయ్యారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వైఎస్ జగన్ కేబినెట్‌లో చేరారు. కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రి హోదాలో దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉద్దేశించిన కీలక ఎంఓయూలను కుదుర్చుకున్నారు.

    ఫిట్ అండ్ ఫైన్..

    ఫిట్ అండ్ ఫైన్..

    దుబాయ్ నుంచి తిరిగొచ్చిన మరుసటి రోజే గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. తొలుత ఆయన గుండెపోటుకు గురయ్యారు. కుప్పకూలిన వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రెడ్డి- శారీరకంగా చాలా ధృడంగా ఉంటారు. రోజూ జిమ్ చేస్తారు. మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరుంది ఆయనకు. ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంటారు. అనారోగ్యానికి గురైన సందర్భాలు చాలా తక్కువ. కొద్దిరోజుల కిందటే ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. వేగంగా కోలుకోగలిగారు. తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    పోస్ట్ కోవిడ్ కారణాలు..

    పోస్ట్ కోవిడ్ కారణాలు..

    అలాంటి వ్యక్తి- హఠాత్తుగా గుండెపోటుకు గురి కావడం చర్చనీయాంశమైంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తరువాత ఏర్పడిన ఆరోగ్య పరిస్థితులు గౌతమ్ రెడ్డి హఠాన్మరణానికి ఓ కారణం అయి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. పోస్ట్ కోవిడ్ అనారోగ్య పరిణామాలు గుండెపోటు రావడానికి దారి తీసి ఉంటాయని డాక్టర్లు అంచనా వేస్తోన్నారు. ఎలాంటి అనారోగ్యం లేకుండా, శారీరంగా ధృఢంగా ఉండే ఆయనకు గుండెపోటు రావడానికి పోస్ట్ కోవిడ్ పరిణామాలు కారణమై ఉంటాయని చెబుతున్నారు.

    వివాద రహితుడు..

    వివాద రహితుడు..

    మేకపాటి గౌతమ్ రెడ్డి.. వివాదరహితుడనే పేరుంది. మృదు స్వభావిగా చెబుతుంటారు. ఎప్పుడూ ఆయన అధికారుల మీద కోపగించుకున్న సందర్భాలు కూడా లేవనే అంటుంటారు. ఐటీ, పరిశ్రమలు వంటి కీలకమైన శాఖలకు మంత్రిగా ఉంటూ తీరిక లేకుండా గడిపన పరిస్థితుల్లోనూ ఎవరి మీదా విసుక్కున్నట్లుగా కూడా వార్తలు లేవని అభిమానులు చెబుతున్నారు. అలాంటి నాయకుడు హఠన్మరణానికి గురి కావడం కలచి వేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+