నేను ఫోన్ చేస్తే ఆ ఎంపీ లిఫ్ట్ చేయలేదు, అవమానించినా ప్రజల కోసం మద్దతు ఇచ్చాను: పవన్ కళ్యాణ్
ఒంగోలు: ''అరెస్ట్ చేసిన తన అభిమానులను విడుదల చేయించాలని తాను ఒకసారి ఎంపీ గోకరాజు గంగరాజుకు ఫోన్ చేస్తే ఆయన కనీసం నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు..'' అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవకాశవాద రాజకీయాలకు ఇదే నిదర్శనమంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఒంగోలుకు వచ్చిన సందర్భంగా జనసేన కర్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద గత నెలలో జరిగిన పడవ బోల్తా ప్రమాదంలో ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద మృతుల్లో అత్యధికులు ప్రకాశం జిల్లాకు చెందిన వారే.
ఈ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు శనివారం పవన్ కళ్యాణ్ ఒంగోలుకు వచ్చారు. అక్కడి ఎన్టీఆర్ కళా క్షేత్రంలో బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. అనంతరం జనసేన కర్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ''కొందరు టీడీపీ నేతలు నన్ను అవమానించినా కేవలం ప్రజల కోసమే టీడీపీకి మద్దతిచ్చాను..'' అని పవన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications