నాగార్జున వర్సెస్ జూ ఎన్టీఆర్ : బోరు ఎక్కడ-జోష్ ఎవరిది : ఫ్యాన్స్ ఒపీనియన్-వైరల్..!!

వెండి తెర మీద ఒకరు మన్మధుడు. మరొకరు యంగ్ టైగర్. ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ ఇప్పుడు బుల్లి తెర పైన ప్రతీ ఇంటా సందడి చేస్తున్నారు. గతంలోనే వీరు ఇలాంటి రియాల్టీ షో లు చేసారు. అయితే, వారి స్థానాలు... ఛానళ్లు మారాయి. కానీ, అభిమానుల్లో వారి పైన అంచనాలు మాత్రం తగ్గటం లేదు. చూస్తున్న ప్రేక్షకుల్లోనూ భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరి ప్రముఖ హీరోలు టీవీ సెట్ల ముందున్న వీక్షకులను ఎంటర్ టెయిన్ చేయటంలో..సక్సెస్ అవ్వటం లో ఏ రేంజ్ లో ఉన్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ.

అటు నాగ్...ఇటు తారక్

అటు నాగ్...ఇటు తారక్

మీలో ఎవరు కోటీశ్వరుడు మా టీవీలో చేసిన నాగార్జున రోల్ ఇప్పుడు మారింది. అదే సమయంలో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త పాత్రలో కనిపిస్తున్నారు. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ కాగా.. తారక్ ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరులు షో నిర్వహిస్తున్నారు. రెండు టీవీ ఛానళ్లు..రెండు ప్రోగ్రామ్ లు..ఇద్దరు ప్రముఖ హీరోలు..వారి ప్రతీ కదలిక పైన నిశితంగా పరిశీలన మొదలైంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతోంది. మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమం కోసం ఆర్ఆర్ఆర్ మూవీలో బిజీగా ఉన్నా తారక్ ప్రత్యేకంగా సమయం కేటాయించారు.

తారక్ - చరణ్ షో అదుర్స్..

తారక్ - చరణ్ షో అదుర్స్..

ఆర్ఆర్ఆర్ పార్టనర్ హీరో రాం చరణ్ తో కలిసి నిర్వహించిన కర్టెన్ రైజర్ షో మాత్రం అదుర్స్ అని ప్రశంసలు అందుకుంది. తారక్ - చరణ్ ఇద్దరూ అది ఒక షో అని మర్చిపోయి..వ్యక్తిగత-ఆసక్తి కర అంశాలతో ఆకట్టుకున్నారు. దీంతో..ఆ రెండు రోజుల కర్టెన్ రైజర్ షో కు మంచి రేటింగ్ వచ్చింది. కానీ, ఆ తరువాత అంతగా ఆ కార్యక్రమం ఇంప్రెస్ చేయటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. తారక్ అగ్రనటుడైనా.. ఆయన నిర్వహణలో లోపాలు కనిపించకపోయినా.. ప్రేక్షకులు మాత్రం కొత్త దనం కోరుకుంటున్నారు. ఆ కర్యక్రమానికి తగిన స్థాయిలో ప్రచారం లేదనే అభిప్రాయమూ ఉంది.

బిగ్ బాస్ హోస్ట్ పైన డిఫరెంట్ ఒపీనియన్

బిగ్ బాస్ హోస్ట్ పైన డిఫరెంట్ ఒపీనియన్

జూనియర్ హోస్టింగ్ స్కిల్స్... ఆయన పెర్ఫార్మెన్స్ -పాపులారిటీ స్థాయికి తగినట్లుగా ఈ కార్యక్రమం డిజైనింగ్ ఉందా అంటే దాని పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక, ఇదే సమయంలో ఆరంభమైన బిగ్ బాస్ కు నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. అయితే, నాగార్జున స్థానంలో జూనియర్ రావాలంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. బిగ్ బాస్ కు నాగార్జున హోస్ట్ గా ఉండటం బోర్ కొడుతుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వారు జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ హోస్ట్‏గా తీసుకురావాలంటూ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

ఇద్దరు హీరోలు షో లు మార్చారు..కానీ, అభిమానులు మాత్రం

ఇద్దరు హీరోలు షో లు మార్చారు..కానీ, అభిమానులు మాత్రం

బిగ్‏బాస్ హోస్ట్ పై పాజిటివిటితోపాటు.. నెగిటివిటి ఎక్కువగా వినిపిస్తోంది. ఆదివారం ప్రారంభమైన బిగ్‏బాస్ షోలోకి గ్రాండ్‏గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మాస్, తనదైన స్టెప్పులతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. హోస్టుగా వరుసుగా మూడో సారి రావటంతో..అనుభవాన్ని ప్రదర్శిస్తూ మాటల గారడీతో కంటెస్టెంట్స్‏ను ఇరికించే ప్రయత్నాలు చేసారు. అయినా.. నాగార్జున హోస్ట్ గా కొనసాగటం పైన రెండో రోజు నుంచే చర్చ మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభానికి ముందు నుంచి ప్రారంభం రోజు వరకూ వీక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ కనిపించింది.

ఇద్దరి పైనా భారీ అంచనాలతోనే..

ఇద్దరి పైనా భారీ అంచనాలతోనే..

కంటెస్టెంట్స్ ఎవరనే ఉత్సుకత చూపించారు. హోస్ట్ గా నాగార్జున కాకుంటే ఎవరొస్తారనే చర్చ చేసారు. కానీ, ఇప్పుడు రెండో రోజు నుంచే ఈ విధంగా సోషల్ మీడియాలో చర్చ మొదలవ్వటం ఈ అయిదు సీజన్లలోనూ ఇదే తొలి సారిగా చెప్పుకోవచ్చు. ఇద్దరు అగ్రహీరోలు..రెండు ప్రముఖ షోలను నిర్వహిస్తుంటే...ఇద్దరూ గతంలో ఈ రెండు షోలనే చేసిన వారు కావటం... అందునా..ఇద్దరు హీరోల పైన భారీ అంచనాలు.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం కూడా ఇప్పుడు రెండు షో ల్లో వీరిద్దరి పెర్మార్ఫ్మెన్స్ ను భూతద్దంలో పరిశీలిస్తున్నారు.

నాగ్ - తారక్ పైన భారం..అటే అందరి చూపు

నాగ్ - తారక్ పైన భారం..అటే అందరి చూపు

మరి...ఈ షో లు ఇంకా చాలా ఎపిసోడ్ లు కంటిన్యూ కావాల్సి ఉంది. దీంతో..నాగ్ - తారక్ రియాల్టీ షో ల నిర్వహణ పైన ఉన్న అంచనాలను ఏ స్థాయిలో నిలబెట్టుకుంటారో చూడాలి. ఈ రెండు షోలను చివరి వరకూ ఈ ఇద్దరే పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రం బిగ్ బాస్ లో తిరిగి జూనియర్ ఎన్టీఆర్ రావాలనే నినాదం వినిపిస్తోంది. నాగార్జున కు మద్దతుగానే పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. షో మొదలైన ఒక రోజులోనే ఎలా డిసైడ్ చేస్తారు..నాగ్ ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తారంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+