నీ తరం కాదు, అది తెలియదా?: కిరణ్‌పై టి నేతల భగ్గు

సిఎం పదవిలో ఉండి ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయవద్దని, అధిష్టానం అడిగినప్పుడు రోడ్డు మ్యాప్ ఎలా ఇచ్చారని మధుయాష్కీ ప్రశ్నించారు. అప్పుడే సమైక్యవాదినని చెబితే బాగుండేదన్నారు. అధిష్టానం దృష్టిలో ముఖ్యమంత్రివి పిల్ల చేష్టలని, అందుకే ఏం మాట్లాడినా పట్టించుకోమన్నారు. తెలంగాణ బిల్లుపై అభిప్రాయం తెలుసుకోవడానికే అసెంబ్లీకి వస్తుందన్నారు. అది ఓటింగు కోసం కాదని కిరణ్, బాబులు తెలుసుకోవాలన్నారు.
రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ సాధిస్తామని, అధిష్టానం నిర్ణయానికి ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరు కట్టుబడి ఉండాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ముఖ్యమంత్రి మాట మార్చి తొండి ఆట ఆడుతున్నారని ప్రభుత్వం చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.
విభజన బిల్లును వ్యతిరేకించేందుకు శాసన సభలో దానిపై ఓటింగ్ అవకాశం ఉండదన్న ఇంగిత జ్ఞానం కూడా కిరణ్‌కు లేదని, కిరణ్, లగడపాటి, కావూరి వంటి నాయకుల జేజమ్మలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని తెరాస నేత ఈటెల రాజేందర్ అన్నారు. కిరణ్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నట్లుగా ఉందని, మానసికంగా దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోందని హరీష్ రావు అన్నారు. తాటాకా చప్పుళ్లతో తెలంగాణ ఆగదన్నారు. కెసిఆర్‌ను సిఎంను చేసి రాష్ట్రాన్ని విడగొట్టవద్దనేవి దిగజారుడు వ్యాఖ్యలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అంటే గౌరవమని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆమెను లెక్క చేయడం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్ ఆదివారం అన్నారు. సోనియా, ప్రధానమమంత్రి మన్మోహన్ సింగ్‌లను కిరణ్ లెక్క చేయడం లేదని మండిపడ్డారు. కిరణ్ తన పదవికి రాజీనామా చేసి అధిష్టానాన్ని ధిక్కరించాలన్నారు.
శాసన సభలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడం చాలా బాధాకరమని కరీంనగర్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆదివారం అన్నారు. రాజ్యాంగం పైన ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ బిల్లు విషయంలో కిరణ్ మూర్ఖంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications