వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోర్లు ఓపెన్ చేయమని మేం చెప్పామా, అప్పుడే కంట్రోల్ అవుతారు: అమిత్ షాకు‌కు బాబు వార్నింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సోమవారం నాడు వార్నింగ్ ఇచ్చారు. 2019 ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ తిరిగి తమతో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుందని, కానీ డోర్లు క్లోజ్ అయ్యాయని అమిత్ షా చెప్పారు.

ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటించిన అమిత్ షా టీడీపీ, బీజేపీ పొత్తుపై ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో దోస్తీకి టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. దీనిపై ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.

<strong>చంద్రబాబుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు: ఏపీలో జగన్ ఎటువైపో తేలిపోయిందా?</strong>చంద్రబాబుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు: ఏపీలో జగన్ ఎటువైపో తేలిపోయిందా?

 మీకు మరో నెల మాత్రమే ఉంది

మీకు మరో నెల మాత్రమే ఉంది

బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇంకా చాలా చేస్తుందని, కానీ వీరికి మరో నెల రోజులు మాత్రమే ఉందని, ప్రజలు బుద్ధి చెబుతారని బాబు హెచ్చరించారు. తమకు డోర్లు క్లోజ్ చేస్తారని అమిత్ షా అనడంపై స్పందిస్తూ.. ప్రజలు వీరికి డోర్లు క్లోజ్ చేసే పరిస్థితి వస్తుందన్నారు. ఇంత అహంభావం రాజకీయాల్లో పనికి రాదన్నారు. హుందాతనం ఉండాలన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ కూడా వీరిలా ఆలోచిస్తే బీజేపీ అధికారంలోకి వచ్చేదా అన్నారు.

 సీనియర్‌గా చెబుతున్నా.. అమిత్ షాకు హెచ్చరిక

సీనియర్‌గా చెబుతున్నా.. అమిత్ షాకు హెచ్చరిక

నేను ఓ సీనియర్ నాయకుడిగా బీజేపీకి ఒకే విషయం చెబుతున్నానని, పద్ధతి లేని, విలువలు లేని రాజకీయాలు చేస్తే మంచిది కాదన్నారు. మీరు భయపెడితే ఎవరూ భయపడరని, తిరుగుబాటు చేస్తారని చెప్పారు. ఏపీలో మేం ప్రజాహితంతో ముందుకు సాగుతున్నామన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 2014 ఎన్నికల సమయంలో ఎవరు ఎవరి వద్దకు వచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పారు. అసలు మిమ్మల్ని డోర్లు ఓపెన్ చేయమని ఎవరు చెప్పారని, ఎందుకిలా మాట్లాడుతున్నారని, అతని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని చెప్పారు.

 మేం నలభైయ్యేళ్లు కష్టపడి లీడర్లం అయ్యాం

మేం నలభైయ్యేళ్లు కష్టపడి లీడర్లం అయ్యాం

అరెస్ట్ వారెంట్ ఇచ్చి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా అన్నారు. సీబీఐ సహా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. దీని వల్ల నాయకత్వాన్ని కూడా ఫినిష్ చేస్తున్నారన్నారు. తాను నలభై ఏళ్లుగా ప్రజల్లో ఉండి లీడర్‌గా బిల్డప్ అయ్యానని, మమతా బెనర్జీ కూడా నలభై ఏళ్లు కష్టపడి లీడర్‌గా ఎదిగారని, శరద్ పవార్ తన కంటే సీనియర్ అని, ఫరూక్ అబ్దుల్లా కూడా తమ కంటే సీనియర్ అని, ఇలాంటి వారిని వేధించే పరిస్థితి వస్తే ఎలా అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లుగా ఈ దేశంలో ఏ నాయకుడు ఉండవద్దని చేస్తారా అన్నారు.

తిరుగుబాటు చేస్తే కంట్రోల్ అవుతారు

తిరుగుబాటు చేస్తే కంట్రోల్ అవుతారు

రాజకీయ నాయకులతో పాటు అధికారులు, మీడియాను కూడా భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కార్పోరేట్ సంస్థలు కూడా భయపడుతున్నాయన్నారు. ఇది తప్పుడు విధానం అన్నారు. ప్రజాస్వామ్య వాదులు దీనిని ఖండించాలన్నారు. ఎక్కడికి అక్కడ తిరుగుబాటు చేస్తే తప్ప వారు కంట్రోల్ కారని చెప్పారు. అధికారం ఉందని ఇష్టానుసారం చేస్తున్నారని మండిపడ్డారు.

English summary
Andhra Pradesh CM N Chandrababu Naidu on Amit Shah's remark 'doors closed for Chandrababu Naidu in NDA': Who has asked him to open the door? Why is he talking like this? I totally condemn this attitude and arrogance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X