ఆ లక్షణం ఉంటే.. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కంపల్సరీ, అధికారులకు సీఎం జగన్ స్పష్టీకరణ
కరోనా లక్షణం స్వాబ్ టెస్ట్ ద్వారా తెలియడం లేదు. 80 శాతం వరకు కన్ఫామ్ కావడం లేదు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ద్వారా పక్కా తెలుస్తోంది. అదీ కాదంటే చెస్ట్ స్కాన్ చేస్తే వైరస్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. అయితే చాలా మంది స్వాబ్ టెస్ట్ చేయించుకొని ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వైరస్ మాత్రం అలానే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు అందుబాటులో ఉండాలని అధికారులను సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పకుండా చేయాలని చెప్పారు. ఇవాళ ఆయన వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ విధించకుండానే కరోనాను కట్టడి చేసే అంశంపై చర్చించారు.

రాష్ట్రంలోని అర్భన్ ప్రాంతాల్లో 62 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కోవిడ్ కేసులు ఉన్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే మరణాలు అధికంగా నమోదవుతున్నాయని సీఎంకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఆలస్యంగా ఆసుపత్రులను ఆశ్రయించడమే దీనికి కారణమని చెప్పారు. వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు జగన్ సూచించారు.
ప్రతి ఇంట్లో సర్వే నిర్వహించాలని అధికారులకు స్పష్టంచేశారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రులను పర్యవేక్షించాలని జగన్ చెప్పారు. కరోనా పేషెంట్లకు నాణ్యమైన భోజనం అందజేయాలని సూచించారు. శానిటైజేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పదే పదే చెప్పారు.












Click it and Unblock the Notifications