వారంతా అటువైపే మొగ్గారు.. ఏపీలో అధికారం ఆ పార్టీదే!
మే 13వ తేదీన ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ నాలుగోతేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యలో 21 రోజుల సమయం ఉంది. 82 శాతం పోలింగ్ నమోదు కావడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పడిందని టీడీపీ, ప్రభుత్వ అనుకూల ఓటు భారీగా పడిందని వైసీపీ అంచనా వేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూడదు కాబట్టి కొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెబుతుంటే, మరికొన్ని సంస్థలు టీడీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో ప్రముఖ సెఫాలజిస్టులు రంగప్రవేశం చేశారు. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనేదానిపై కుండబద్దలు కొట్టినట్లు తేల్చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ కేంద్రంగా..
రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ లు కూడా భారీగా జరుగుతున్నాయి. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ ఎంత మెజారిటీ సాధిస్తాడు? అనేదానిపై బెట్టింగ్ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలవారీగా బెట్టింగ్ జరగడంతోపాటు అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనే విషయంలో కూడా బెట్టింగ్ జరుగుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండటంతో వారు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. గత ఎన్నికల సమయంలో కేవలం రెండున్నర లక్షల మందే ఓటు హక్కును వినియోగించుకోగా, ఈసారి దాదాపు ఐదు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం.

ఉద్యోగులంతా మూకుమ్మడిగా..
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులంతా దాదాపు 80 శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం టీడీపీకి 60 శాతం, వైసీపీకి 40 శాతం చొప్పున ఉద్యోగుల ఓట్లు పడ్డాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఎన్ని అడ్డంకులెదురైనా ఓటు హక్కును మాత్రం ఉద్యోగులంతా ఉపయోగించుకున్నారు. వీరి పోలింగ్ సరళిని అంచనా వేస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అర్థమవుతోందని, ఉద్యోగులంతా టీడీపీవైపే మొగ్గారని విశ్లేషకులు అంటున్నారు. ఫలితాలు ఏమిటనేది జూన్ నాలుగున తెలవనుంది.












Click it and Unblock the Notifications