థియేటర్ల పంచాయితీలో గెలిచిందెవరు?

సంక్రాంతి పండగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పంచాయితీ జరిగిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ ముగిసింది. ఎవరి పాఠశాలలకు వారు, ఎవరి కార్యాలయాలకు వారు వెళుతున్నారు. మరి ఈ రేసులో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి సమాధానం లేదు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి సీజన్ ను పూర్తిగా పిండేశాయి. వారసుడు, కల్యాణం కమనీయం సినిమాలు మమ అనిపించాయి. కానీ సంక్రాంతికి ముందు తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన యుద్ధం భవిష్యత్తులో అందరికీ పాఠంగా నిలవాలి.

వారసుడు, కల్యాణం కమనీయంకు టాక్ లేదు

వారసుడు, కల్యాణం కమనీయంకు టాక్ లేదు

జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలవుతాయని నిర్మాతలు ముందే ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు వారసుడు సినిమా తనది కావడంతో ముందుగానే థియేటర్లను లాక్ చేశారు. దీనిపై విమర్శలు వచ్చాయి.

తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఫిలిం ఛాంబర్ చెప్పినప్పటికీ దిల్ రాజు వెనక్కి తగ్గలేదు. కాకపోతే 14వ తేదీకి సినిమాను వాయిదా వేసి విడుదల చేశారు. ఈ సినిమాకు టాక్ కూడా సోసోగా రావడంతో పండగ రోజుల్లో మినహా పెద్దగా వసూళ్లు దక్కించుకోలేకపోయింది. కల్యాణం కమనీయం సంగతి కూడా అంతే.

చెరో రూ.10 కోట్లు వచ్చి వుంటే అందరూ హ్యాపీ

చెరో రూ.10 కోట్లు వచ్చి వుంటే అందరూ హ్యాపీ

ఇద్దరు పెద్ద హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చెరో రూ.100 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టాయి. అయితే వారసుడుకానీ, కల్యాణం కమనీయం సినిమాలకు కేటాయించిన థియేటర్లను ఇద్దరు అగ్ర హీరోలకు ఇచ్చివుంటే ఎంతలేదన్నా చెరో 10 కోట్లరూపాయలు వసూళ్లు చేసేవారని, దీనిద్వారా నిర్మాతలతోపాటు థియేటర్ యాజమాన్యానికి కూడా లాభం కలిగేదని పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి.

కానీ థియేటర్ల అద్దె కూడా రానివిధంగా కల్యాణం కమనీయం కలెక్షన్లు ఉన్నాయి. వారసుడుకు టాక్ సరిగా రాకపోవడంతో మొదటి రెండు మూడు రోజులు మినహా తర్వాత వసూళ్లు లేవు.

పరిశ్రమలో విభేదాలు బట్టబయలు

పరిశ్రమలో విభేదాలు బట్టబయలు

మైత్రి సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసుకోవడంతోనే దిల్ రాజు వెనక్కి తగ్గలేదని, తన సినిమాను పట్టుదలగా సంక్రాంతికే విడుదల చేశారని వార్తలు వచ్చాయి. మరోవైపు యూవీ క్రియేషన్స్ కూడా హఠాత్తుగా తమ సినిమాను విడుదల చేయాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో ఈ తరహా పోకడలు, పట్టుదలలవల్ల ఎవరెంత నష్టపోయినా, ఎవరెంత లాభపడినా పరిశ్రమలో ఐకమత్యం లేని విషయం మరోసారి బయటకు వెల్లడైంది. ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ ఏం పాఠం నేర్చుకుందో వచ్చే సంక్రాంతికి కానీ అర్థం కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+