గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపిలో కన్నాచేరకుండా అడ్డుకుంది...అమిత్ షా కాదంట:ఎవరంటే?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

గుంటూరు:బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో ఇక చేరడమే తరువాయి అన్ని చివరి క్షణంలో అనూహ్యంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఒత్తిడికి గురై ఆస్పత్రి పాలైన సంగతీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైసిపిలోకి కన్నా చేరిక నిలిచిపోవడానికి కారణం ఎవరు?...మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నట్లు అమిత్ షా నే స్వయంగా ఫోన్ చేసి కన్నాను నిలువరించారా?...లేక ఇంకెవరితోనైనా చెప్పించారా?...అలా చెప్పిస్తే ఎవరితో చెప్పించారు?...ఆ వివరాలు తెలుసుకునేముందు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే...వైసిపి లోకి కన్నా ప్రతిష్టంభనను టిడిపి అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోందట...అదెలాగంటే?

ముందుగా...కన్నా-వైసిపి ప్రతిష్టంభన

ముందుగా...కన్నా-వైసిపి ప్రతిష్టంభన

బిజెపికి రాజీనామా చేసి ఏప్రిల్ 25 న జగన్ సమక్షంలో వైసిపిలో చేరేందుకు సమాయత్తమైన ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఫిరాయింపు కార్యక్రమానికి లాస్ట్ మినిట్ లో బ్రేక్ పడిన సంగతి అందరికీ తెలిసిందే. అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి గట్టిగా మాట్లాడటం వల్లే కన్నా లక్ష్మీనారాయణ ఆగిపోయారని, ఆ క్రమంలో బాగా ఒత్తిడికి గురై హై బిపితో ఆస్పత్రిలో చేరారని మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. అయితే కన్నా వైసిపిలో చేరకుండా ఒక బిజెపి ముఖ్య నేత ఫోన్ చేసింది ఆపిన మాట వాస్తవమే కానీ ఆ నేత అమిత్ షా కాదంట...మరి ఎవరంటే?...

అమిత్ షా కాదా...మరెవరు?

అమిత్ షా కాదా...మరెవరు?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కన్నాకు ఫోన్ చేసి వైసిపిలోకి చేరికను నిలువరించిన వ్యక్తి రాం మాధవ్ అట...బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అట. మొదట కాశ్మీర్ ఆ తరువాత త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసి విజయవంతమైన రాం మాధవ్ తెలుగువాడనే సంగతి తెలిసిందే. అంతేకాదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...కాంగ్రెస్ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను బిజెపిలో చేర్చింది రాం మాధవ్ కావడం గమనార్హం.
ఈ విషయాన్ని బిజెపిలో చేరే సమయంలో కన్నా లక్ష్మీనారాయణే స్వయంగా ప్రకటించారు.

అప్పుడు కన్నా ఏం చెప్పారంటే?

అప్పుడు కన్నా ఏం చెప్పారంటే?

బిజెపిలో చేరే సమయంలో కన్నా లక్ష్మీ నారాయణ ఏం చెప్పారంటే...ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న పనిని చూసి ఆయన పట్ల ఆకర్షితుడినై బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నానని, పార్టీలో చేరాలన్న తన ఆకాంక్షను రామ్‌ మాధవ్‌కు తెలియజేశానని, ఆయన ఇచ్చిన సమయం ప్రకారం వచ్చి బిజెపిలో చేరానని ఆయన వెల్లడించారు. అయితే బిజెపి పార్టీ నియమావళి ప్రకారం ఏ రాషా్ట్రనికి చెందినవారు ఆ రాష్ర్టానికి చెందిన పార్టీ అధ్యక్షుల సమక్షంలోనే పార్టీలో చేరాలి. ఈ నియమం ప్రకారం కన్నా ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో అధికారికంగా బిజెపిలో చేరారు.

సో...అదే రాం మాధవ్...లైన్ లోకి వచ్చారు.

సో...అదే రాం మాధవ్...లైన్ లోకి వచ్చారు.

కన్నా బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు రాజీనామా లేఖ పంపడం ద్వారా ఆయన రాం మాధవ్ కి సూచించారో...లేక రాం మాధవే తన ద్వారానే ఆయన బిజెపిలోకి వచ్చారు కాబట్టి తాను సమాధానం చెప్పుకోవాల్సివుంటుందంటూ కన్నా కి ఫోన్ చేశారో తెలియదు కానీ కన్నాకు ఫోన్ ఫోన్ చేసి గట్టిగా మాట్లాడి ఆయన వైసిపిలోకి చేరకుండా ఆపింది మాత్రం ఆయనేనని తెలిసింది. ఈ సందర్భంగా కన్నాకు రాం మాధవ్ నచ్చచెబుతూ పార్టీలో మీకు అన్యాయం జరగదని, తప్పకుండా న్యాయం జరుగుతుందని, అందుకు తానే హామీ అని, తనపై నమ్మకం ఉంచి ఆగిపోవాలని కోరారట. మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా తనకు ఆ బాధ్యత ఉందన్నారట. అయితే తనకు రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి ఇస్తేనే పార్టీలో ఉండగలనని కన్నా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ నియమావళి ప్రకారం ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి లేదని, ఆ కారణంతోనే పార్టీ నేతలే కన్నాకు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుపడుతున్నట్లు, ఈ విషయాలన్నీ వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. చివరకు ఏదేమైనా రాం మాధవ్ మాటకు విలువిచ్చి కన్నా తాత్కాలికంగానైనా సరే వైసిపిలోకి తన చేరికను వాయిదా వేసుకున్నారు.

టిడిపికి అవకాశం...ప్రయత్నాలు ముమ్మరం

టిడిపికి అవకాశం...ప్రయత్నాలు ముమ్మరం

కారణాలేమైనా వైసిపి లోకి కన్నా చేరిక నిలిచిపోయింది కాబట్టి...తరువాతైనా ఆయన ఆ పార్టీలో కొనసాగక పోవచ్చని...అయితే ఆయన వైసిపిలో చేరకుండా టిడిపిలో చేరేలా చూడాలని మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. కన్నా లక్ష్మీనారాయణతో టిడిపి నేతలు పుల్లారావు, ఆలపాటి రాజాకు వ్యాపార పరమైన లావాదేవీలు ఉన్నాయని గుంటూరు జిల్లాలో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు కన్నాను టిడిపి లోకి తెచ్చేందుకు గట్టిగానే సంప్రదింపులు జరిపారని టాక్. అయితే పార్టీలో చేరాలంటే కన్నా పెట్టిన కండిషన్స్ అన్నీ నెరవేర్చడం సాధ్యం కాదని, కొన్ని మాత్రం చేయగలమని టిడిపి నేతలు తెలిపారట. దీంతో ఈ కండిషన్స్ అన్నీ పుల్ ఫిల్ చేసేందుకు వైసిపి అంగీకరించడంతో ఆయన వైసిపిలో చేరేందుకు సంసిద్దమయ్యారనే తాజాగా గుంటూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో కన్న బిజెపిలోనే కొనసాగుతారా? లేక వైసిపిలోకి వెళ్లిపోతారా?...లేక టిడిపి తమ ప్రయత్నాలు ముమ్మరం చెయ్యడంతో అవి సఫలమై ఆ పార్టీ బాట పడతారా అనేది మరి కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.

English summary
who stopped kanna joining in to ycp...Amit Shah or anyone else...according to reliable sources that work has done by Ram Madhav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X