మిథున్ తరువాత అరెస్ట్ లిస్టులో నెక్స్ట్..!?
ఏపీ రాజకీయాలు లిక్కర్ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటికే 12 మందిని సిట్ అధికారులు లిక్కర్ కేసులో అరెస్ట్ చేసారు. తాజాగా తొలి చార్జ్ షీట్ దాఖలు చేసారు. అందులో మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించారు. అయితే, జగన్ ను నిందితుడుగా చేర్చలేదు. త్వరలో దాఖలు చేయనున్న మరో ఛార్జ్ షీట్ కీలకం కానుంది. ఇక.. మిథున్ తరువాత అరెస్ట్ లిస్టులో నెక్స్ట్ ఉన్నదెవరు..
కీలక మలుపు
వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రాథమి క అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేరును దీనిలో పలు మార్లు ప్రస్తావించారు. అయితే ఈ అభియోగపత్రంలో ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ అభియోగపత్రాల్లో జగన్ ప్రమేయంపై ఇంకా స్పష్టత రానుంది. 305 పేజీల అభియోగపత్రాన్ని కోర్టులో వేశారు. 70 వాల్యూమ్‌లతో కూడిన వేల అనుబంధ పత్రాల్ని దానికి జతపరిచి న్యాయస్థానంలో సమర్పించా రు. ఈ కేసులో ఇప్పటి వరకు 40 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా చేర్చగా తాజాగా మరో 8 మందిని నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 16 మందిపై అభియోగాలు మోపారు.

వరుస అరెస్టులు
ఈ కేసులో ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎస్‌పీవై డిస్టిలరీస్ పూర్వ డైరెక్టర్ సజ్జల శ్రీధర్‌రెడ్డి, రాజ్ కెసిరెడ్డి అనుచరులు బూనేటి చాణక్య, పైలా దిలీప్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్నేహితుడు వెంకటేశ్‌నాయుడు, పీఏలు నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్‌లు తదితరులను అరెస్టు చేశారు. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. హై కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ముందస్తు బెయిల్ దక్కకపోవటంతో మిథున్ ను సిట్ విచారణ తరువాత నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసింది. మిథున్ పాత్ర పైన పూర్తి ఆధారాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
లిస్టులో నెక్స్ట్
ఇక, ఇప్పుడు మిథున్ తరువాత అరెస్ట్ లిస్టులో ఉన్నదెవరనేది చర్చగా మారింది. ఈ కేసులో 21న విచారణకు మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో విజయ సాయిరెడ్డి సైతం విచారణ ఎదుర్కొన్నారు. రెండో విడత విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరారు. తాజాగా మిథున్ రెడ్డి అరెస్ట్ పైన వైసీపీ నేతలు స్పందించారు. లేని కేసు పేరుతో రాజకీయంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక.. ఇప్పుడు ఈ కేసు కీలక దశకు చేరుకోవటంతో.. వరుసగా జరిగే విచారణలు.. తదుపరి ఛార్జ్ షీట్ లో పేర్కొనే అంశాలు.. నిందితుల ప్రస్తావన.. తరువాత జరిగే అరెస్టుల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications