సీఎం జగన్ పై పులివెందుల కాంగ్రెస్ అభ్యర్ది ఖరారు..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. జగన్ తన అభ్యర్దుల ఎంపిక కసరత్తు వేగవంతం చేసారు. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా, సింగిల్ గా పోటీ చేస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇటు కాంగ్రెస్ షర్మిల పైన భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలోనే వచ్చే ఎన్నికల్లో జగన్ పైన వైఎస్ కుటుంబం నుంచి పులివెందుల కాంగ్రెస్ అభ్యర్ది బరిలో నిలుస్తారని తెలుస్తోంది.
షర్మిల ఎంట్రీ వేళ: వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దుల ఎంపిక తుది దశకు చేరింది. ఈ నెల 25 నుంచి జగన్ జిల్లా పర్యటనలు ప్రారంభిస్తున్నారు. బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఈ నెలాఖరు వరకు చూసి తమ రెండు పార్టీలు ఎన్నికల కసరత్తు వేగవంతం చేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపడుతున్నారు.

ఏపీలో జగన్ వైపు మళ్లిన కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ను తిరిగి తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం షర్మిలకు టాస్క్ అప్పగించింది. ఈ సమయంలోనే వైసీపీలో సీట్లు రాని కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్దుల పైనా అంచనాలు మొదలయ్యాయి.
పులివెందుల బరిలో: వచ్చే ఎన్నికల్లో షర్మిలను పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. నియోజకవర్గం ఎంపిక ఛాయిస్ షర్మిలకే వదిలేసారు. ఇదే సమయంలో కడప ఎంపీ , పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దులుగా ఎవరు బరిలో నిలుస్తారనే చర్చ మొదలైంది. షర్మిల స్వయంగా కడప ఎంపీగా పోటీ చేస్తారనే ఒక వాదన కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.
వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి తిరిగి కడప ఎంపీగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీటు నుంచి షర్మిల పోటీ చేస్తారా లేక డాక్టర్ నర్రెడ్డి సునీత పోటీలో ఉంటారా అనేది ఇప్పుడు కడప పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో పులివెందుల అసెంబ్లీ స్థానం పైన కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి.
షర్మిల నిర్ణయమే కీలకం: షర్మిల, సునీత పేర్లతో పాటుగా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పేర్లను కాంగ్రెస్ నేతలు తెర మీదకు తీసుకొస్తున్నారు. 2011లో జగన్ పార్టీ ఏర్పాటు తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో విజయమ్మ పైన కాంగ్రెస్ అభ్యర్దిగా వైఎస్ వివేకా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో విజయమ్మ గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా జగన్ గెలుపొందారు. ఇప్పుడు మారుతున్న లెక్కలతో కాంగ్రెస్ నుంచి ఎవరు పులివెందుల అభ్యర్ది అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
టీడీపీ నుంచి బీటెక్ రవి తిరిగి పోటీ చేయటం ఖాయం. అయితే, జగన్ పోటీలో ఉన్న నియోజకవర్గం నుంచి నిజంగా ప్రచారం జరుగుతున్నట్లుగా వైఎస్సార్ ఫ్యామిలీ నుంచే కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో ఉంటారా లేదా అనే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో షర్మిల నిర్ణయం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications