రాష్ట్రపతిగా వెంకయ్యకు పదోన్నతి..!!? రేసులో మరో ముగ్గురు : కీలకం కానున్న వైసీపీ - వాటిపై పట్టు..!!
భారత తదుపరి రాష్ట్రపతి ఎవరు. ఉప రాష్ట్రపతి వెంకయ్యకు పదోన్నతి దక్కనందా. రేసులో ఉన్నదెవరు. వైసీపీ పాత్ర ఏంటి. ఏం జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 25తో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని సీఎంలు, ఎన్డీఏతర పార్టీల ముఖ్యమంత్రులతోనూ చర్చించేందుకు బీజేపీ కొందరు కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించింది.

సంప్రదింపులు ప్రారంభించిన బీజేపీ
కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మూడు రోజుల కిందట బిహార్ సీఎం, జనతాదళ్(యు) నేత నితీశ్ కుమార్‌తో చర్చలు జరిపారు. త్వరలో ఏపీలోని అధికార పార్టీ వైసీపీ, ఒడిసా అధికార పార్టీ బిజూ జనతాదళ్ పార్టీల అధినేతలతోనూ చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులు రానున్నట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా అభ్యర్ధిని ఖరారు చేసేలా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీలో 10,98,903 ఓట్లు ఉండగా, బీజేపీకి 4,65,797 ఓట్లు, మిత్ర పక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి. మొత్తం 5,37,126 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి లభిస్తాయని, అయినప్పటికీ 9,194 ఓట్లు తక్కువవుతాయని లెక్కలు తేల్చారు. ఒక వేళ ఎన్డీఏతర పార్టీలన్నీ కలిసికట్టుగా ఒకే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం పోటీ ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

వెంకయ్యకు ప్రమోషన్ దక్కేనా - రేసులో
అందరికీ సన్నిహితుడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతిగా పదోన్నతి కల్పిస్తే..ప్రతిపక్ష పార్టీలోకి కొన్ని పార్టీలు సైతం కలిసి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, అన్ని రకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో...ప్రత్యామ్నాయాలు..మిత్రపక్షాల అభిప్రాయలకు అగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. వెంకయ్య పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సమయంలోనే..పలువురు ఆయన్ను రాష్ట్రపతి హోదాలో చూడాలని భావిస్తున్నామంటూ ఆకాక్షింస్తున్నారు. గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. ఎస్టీ మహిళకు అవకాశం లభించే విషయంపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోందని సమాచారం.

కీలకంగా మారుతున్న వైసీపీ మద్దతు
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయా ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష కూమటి నుంచి ప్రముఖంగా రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్, దేవెగౌడ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో టీఆర్ఎస్..శివసేన..అకాలీదళ్..ఆప్ వంటి పార్టీలు బీజేపీ ప్రతిపాదిత అభ్యర్ధికి మద్దతు ఇచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ పార్టీలు దూరమయ్యాయి. అదే సమయంలో తొలి నుంచి బీజేపీ కూటమిలో భాగస్వామి కాకపోయినా బీజేడీ.. వైసీపీలు పలు సందర్భాల్లో మద్దతుగా నిలిచాయి. రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక విషయంలో వైసీపీ మద్దతు కీలకంగా మారుతోంది. ఇక, ప్రతిపక్షాలను సైతం కలుపుకు పోవాలంటే.. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పేరు తెర మీదకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు
కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ పేరును రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అదేసమయంలో.. ఎస్సీ నేత అయిన కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అర్జున్ ముండా పేర్లు కూడా ఉపరాష్ట్రపతిగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వైసీపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికకు మద్దతిచ్చేందుకు సిద్దపడితేనే కొన్ని అంశాలను మాత్రం స్పష్టత కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైసీపీ పట్టు బిగించేందుకు సమాయత్తం
ఏపీ ఆర్దిక పరిస్థితి కారణంగా.. గతంలో తీసుకున్న నిర్ణయాలకు ముడి పెట్టకుండా..మినహాయింపులు..అదే విధంగా పోలవరం..ఇక, పొత్తుల విషయంలో టీడీపీతో బీజేపీ వైఖరి పైన క్లారిటీ తీసుకోవలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీలో ఇప్పుడు పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటి వరకు ఏ అంశం పైన గట్టిగా మాట్లాడని వైసీపీ..ఈ సారి మాత్రం ఈ మూడు అంశాల పైన పట్టుబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో..వచ్చే వారం బీజేపీ కేంద్ర ముఖ్యులు - సీఎం జగన్ తో సమావేశ సమయంలో ఈ చర్చలు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications