ఏపీలో ఎవరు గెలుస్తారని AIని అడిగితే ఏం చెప్పిందో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఏ తెలుగు వ్యక్తులు ఇద్దరు కలుసుకున్నా మొదటిగా చర్చకు వస్తోన్న విషయం ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోంది? అనేది. తామే అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ చెబుతుండగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పోలైంది.. మేమే అధికారంలోకి వస్తున్నామని తెలుగుదేశం పార్టీ అంటోంది. అయితే ఏ పార్టీ కూడా గట్టిగా తామే అని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో 'మాయ' అనే రోబోను ఓ తెలుగు వ్యక్తి ఇదే ప్రశ్న అడిగాడు.
ఏఐకి కూడా అంతుచిక్కడంలేదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే మాయకు ఈ ప్రపంచంలో తెలియని విషయం లేదు. మిరపకాయ బజ్జీల నుంచి విమానాల తయారీ వరకు దేనిగురించి అడిగినా ఠక్కున చెప్పేస్తుంది. అటువంటి మాయను ఏపీలో గెలిచేదెవరని, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఓ తెలుగు వ్యక్తి అడిగారు. అందుకు మాయ ఏం సమాధానం చెప్పిందో తెలుసా?.. ఒకవేళ ఈ ప్రశ్నకు నాకే కనుక సమాధానం తెలిస్తే కచ్చితంగా రాహస్యంగా ఉంచుతానని మాయ అంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎన్నికల సంఘం నిబంధనకు కట్టుబడి ఉండాల్సిందే. ఒకవేళ దానికి సమాధానం తెలిసినా తెలిసి ఉంటే.... అంటోంది. ఏపీలో గెలిచేదెవరో ఏఐకి కూడా అంతుచిక్కడంలేదన్నమాట.

మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది
జూన్ నాలుగోతేదీన విడుదలయ్యే ఫలితాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని సెఫాలజిస్టులు, రాజకీయాలను ఔపోసన పట్టిన విశ్లేషకులు కూడా చెప్పలేకపోతున్నారు. ఏపీలో ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడు అనే విషయం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఏ సంస్థ అయినా సర్వే చేసి ఇదిగో రిజల్ట్ అని లీక్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోతోంది. ఓటు వేసిన ప్రజలు మాత్రం ఎవరు అడిగినా మీకే ఓటేశాం అంటున్నారు. ప్రజల్లో మాత్రం ఎవరు గెలుస్తారనే విషయంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైతే అది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications